Mrunal Thakur: అందాల మృణాల్.. ఖాళీగా ఉండేటప్పుడు చేసే పని ఏంటో తెలుసా?

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. కెరీర్ ప్రారంభించి పదేళ్లు దాటినా.. ఇంకా తొలి రోజుల్ని మర్చిపోలేదట. చాలామంది లా ఒకప్పుడు తను కూడా బాడీ షేమింగ్ కు గురైందట మృణాల్.

Written By: Swathi Chilukuri, Updated On : February 28, 2024 4:39 pm

Mrunal Thakur

Follow us on

Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతోనే ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ ఇచ్చి హాయ్ నాన్న తో తెలుగు తెరపై మెరిసింది మృణాల్. యష్నా గా అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. హాయ్ నాన్నతో మనసుల్ని కదిలించిన ఈ బ్యూటీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ తో మరోసారి అలరించేందుకు సిద్దమైంది.

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. కెరీర్ ప్రారంభించి పదేళ్లు దాటినా.. ఇంకా తొలి రోజుల్ని మర్చిపోలేదట. చాలామంది లా ఒకప్పుడు తను కూడా బాడీ షేమింగ్ కు గురైందట మృణాల్. అందగా లేవు. గ్లామర్ పాత్రల్లో అయితే ఊహించడం కష్టమే అని ముఖం మీదే చెప్పేసేవారట. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం అని నమ్మి సినిమాల్లో కొనసాగిందట ఈ బ్యూటీ.

నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం అని ఇన్ స్టాలోనూ ఈ రంగు దుస్తులతో ఉన్న ఫోటోలే ఎక్కువగా ఉంటాయి అని పేర్కొంది మృణాల్. ఈమె ఇన్ స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 11 కోట్లకు పైమాటే. దగ్గరి వారు ఆమెను గోలి అని పిలుస్తుంటారు. చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు చదివే అలవాటు ఉందట. అందుకే స్నేహితులు పుస్తకాల పురుగు అంటారట.

సీపుడ్ అంటే చాలా ఇష్టమట. చేపలు, రొయ్యలు ఎక్కువగా తింటుందట. సల్మాన్ ఖాన్ కు వీరాభిమాని మృణాల్. ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టవని తెలిపింది ఈ బ్యూటీ. అంతేకాదు ఈమె జంతు ప్రేమికురాలు. వీటి గురించి ఎక్కడైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మద్దతుగా నిలుస్తుందట.