Homeజనరల్భారతీయులకు మరో వ్యాధి ముప్పు.. మద్యం తాగకున్నా..?

భారతీయులకు మరో వ్యాధి ముప్పు.. మద్యం తాగకున్నా..?

Non Alcoholic Fatty Liver Disease

దేశంలోని ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమను ప్రజలు ఎక్కువగా ఇష్టపడటం లేదు. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్ లాంటి జంక్ ఫుడ్ ను తినడానికే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దేశంలో 35 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో చాలామంది షుగర్, బీపీ సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే సరైన ఆహారపు అలవాట్లను పాటించని వారు నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్ బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. చేయకూడని పొరపాట్లు ఇవే..?

సాధారణంగా ఎవరైతే మద్యం ఎక్కువగా తీసుకుంటారో వాళ్ల కాలేయంపై కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఈ కొవ్వు నిల్వలు అనేక ఆరోగ్య సమస్యల బారిన పడటానికి కారణమవుతాయి. అయితే ఈ మధ్య కాలంలో మద్యం తీసుకోని వారిలో సైతం కాలేయంపై కొవ్వు నిల్వలు పెరుగుతుండటం గమనార్హం. దేశంలోని 9 శాతం నుంచి 32 శాతం మందిలో మద్యంతో సంబంధం లేకుండా కొవ్వు నిల్వలు పెరుగుతుండటం గమనార్హం.

Also Read: కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..?

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ బారిన పడకుండా సరైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని సూచనలు చేసింది. ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వారిని భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్ ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. నాన్‌ ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ పడ్డవాళ్లు ఊబకాయంతో కూడా బాధ పడుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

నాన్‌ ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం అరగంట పాటు శారీరక శ్రమ చేయాలి. బరువు తగ్గడంతో పాటు కొవ్వు పదార్థాలను తగ్గించాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఉంటే ఆ వ్యాధులను అదుపులో పెట్టుకోవాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version