వైసీపీలోకి ‘గంటా’.. విజయసాయి క్లారిటీ!

ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు వైసీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. గంటా త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆపార్టీ నంబర్ 2, సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ బుధవారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలన చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని.. గంటా శ్రీనివాసరావు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపారని.. […]

Written By: NARESH, Updated On : March 3, 2021 2:25 pm
Follow us on

ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు వైసీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. గంటా త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆపార్టీ నంబర్ 2, సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.

గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ బుధవారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలన చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని.. గంటా శ్రీనివాసరావు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపారని.. జగన్ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

నిజానికి గంటా చేరికకు ఎప్పుడో రంగం సిద్ధమైనా.. ఆయన ప్రత్యర్థి.. వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇన్నాళ్లు వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఎందుకో విజయసాయిరెడ్డి మారిపోయి గంటాకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.

గంటా చేరికను మంత్రి అవంతి మాత్రం వ్యతిరేకిస్తున్నారు.అందుకే విజయసాయిరెడ్డి సమక్షంలో గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ చేరికకు మంత్రి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నాడు.

దీంతో మరోసారి వైసీపీలో గంటా వర్సెస్ అవంతి పోరు మొదలైనట్టే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన గంటా ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన అవంతి కూడా గెలిచి మంత్రి అయ్యారు. ఈ ఇద్దరు గురు శిష్యులకు ఇప్పుడు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు.