బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ భయపడ్డాడు. తానూ ఎన్నో కలలు కన్న వెబ్ సిరీస్ ను భయంతో మధ్యలోనే ఆపేశాడు. ఇంతకీ, ఎందుకు భయం అంటే.. ఈ మధ్య బాలీవుడ్ హీరోలను బీజేపీ, అలాగే ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా బ్యాచ్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. హిందువులకు సంబంధించిన కథలను చరిత్రలను సినిమాగా తీసినప్పుడు వాటిల్లో పొరపాట్లు జరిగితే.. బీజేపీ బ్యాచ్ ఆ హీరో మీద విరుచుకుపడుతున్నారు. ఆ సినిమాని ఆడకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
Also Read: రిపీట్ అవుతున్న కాంబో.. సక్సెస్ రిపీట్ అవుతుందా?
ఆ మధ్య సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘తాండప్’ వెబ్ సిరీస్ పై కేసులు కూడా పెట్టారు బీజేపీ బ్యాచ్. దాంతో, అమెజాన్ సంస్థ ‘బహిరంగ క్షమాపణ’ కూడా కోరాల్సి వచ్చింది. ఇలాంటి ‘ఇబ్బందికర’ పరిస్థితుల్లో అమీర్ ఖాన్ తానూ ‘మహాభారతం’ వెబ్ సిరీస్ ని తీసి ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకున్నాడేమో, మొత్తానికే ఆ ఆలోచననే విరమించుకుని.. రెగ్యులర్ సినిమా చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్నాడు.
పాపం మహాభారతాన్ని నిర్మించాలని అమీర్ ఖాన్ కి చిరకాల కోరిక. అనేక సీజన్లుగా భారీ ఎత్తున మహాభారతాన్ని ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కోసం రైటర్లకు, డైరెక్టర్లకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడు. లొకేషన్స్ కోసం ప్రత్యేక సెట్స్ కూడా వేయించడానికి సన్నాహాలు చేశాడు. కానీ, ఈ మధ్యలో వెబ్ సిరీస్ కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో అమీర్ ఖాన్ ఇక చేసేదేం లేక మహాభారతం వెబ్ సిరీస్ ఆలోచనని పూర్తిగా వదులుకున్నాడట.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. క్లైమాక్స్ రోమాంచితమేనా!
ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని టార్గెట్ చేయడం ఖాయం అనేది అమీర్ ఖాన్ భావన. పైగా మహాభారతం అనేది మహా సముద్రం లాంటిది. అందులో ఏ చిన్న పొరపాటు జరిగినా తనని అడ్డంగా ఇరికిస్తారని అమీర్ ఖాన్ ఫీల్ అవుతున్నాడట. ఎంత గొప్పగా తీసినా ఏదొక పాత్ర వియషంలో ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. అదే అమీర్ ఖాన్ ను భయపెడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్