దేశంలోని ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమను ప్రజలు ఎక్కువగా ఇష్టపడటం లేదు. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్ లాంటి జంక్ ఫుడ్ ను తినడానికే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దేశంలో 35 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో చాలామంది షుగర్, బీపీ సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే సరైన ఆహారపు అలవాట్లను పాటించని వారు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా.. చేయకూడని పొరపాట్లు ఇవే..?
సాధారణంగా ఎవరైతే మద్యం ఎక్కువగా తీసుకుంటారో వాళ్ల కాలేయంపై కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఈ కొవ్వు నిల్వలు అనేక ఆరోగ్య సమస్యల బారిన పడటానికి కారణమవుతాయి. అయితే ఈ మధ్య కాలంలో మద్యం తీసుకోని వారిలో సైతం కాలేయంపై కొవ్వు నిల్వలు పెరుగుతుండటం గమనార్హం. దేశంలోని 9 శాతం నుంచి 32 శాతం మందిలో మద్యంతో సంబంధం లేకుండా కొవ్వు నిల్వలు పెరుగుతుండటం గమనార్హం.
Also Read: కిడ్నీల్లో రాళ్ళతో బాధ పడుతున్నారా.. తినకూడని ఆహారాలివే..?
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడకుండా సరైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని సూచనలు చేసింది. ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వారిని భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్ ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ పడ్డవాళ్లు ఊబకాయంతో కూడా బాధ పడుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం అరగంట పాటు శారీరక శ్రమ చేయాలి. బరువు తగ్గడంతో పాటు కొవ్వు పదార్థాలను తగ్గించాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఉంటే ఆ వ్యాధులను అదుపులో పెట్టుకోవాలి.