
దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. నిన్న 32,080 కేసులు నమోదవగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. ఇందులో 92,53,306 మంది బాధితులు కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,72,293కు తగ్గింది. ఒకేరోజు 37,725 మంది కొత్తగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 412 మంది మరణించారు. దీంతో కరోనా మృతులు 1,41,772కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.