https://oktelugu.com/

మధ్యాహ్నం తిన్నాక నిద్రను ఆపడానికి సహజ పరిష్కారాలివీ..

రాత్రంతా పడుకుంటే నిద్రపట్టదు. అదే ఆఫీసుకెళ్లాక మధ్యాహ్నం తినగానే నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడు పడుకోవడానికి వీల్లేదు. బాసులు తిడతారు.. ఇలా ఆఫీసులో కునికిపాట్లు పడేవారు ఎందరో.. ఆ సమస్యను అధిగమించాలంటే ఈ కింది చిట్కాలు పాటించి నిద్రాదేవిని దూరంగా తరమేయండి.. -మధ్యాహ్నసమయంలో నిద్రను కంట్రోల్ చేయడానికి సహజమైన పరిష్కారాలు ఉన్నాయి. మీరు కూర్చునే డెస్క్ దగ్గర స్వల్ప వ్యాయామాలు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. Also Read: కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 04:24 PM IST
    Follow us on

    రాత్రంతా పడుకుంటే నిద్రపట్టదు. అదే ఆఫీసుకెళ్లాక మధ్యాహ్నం తినగానే నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడు పడుకోవడానికి వీల్లేదు. బాసులు తిడతారు.. ఇలా ఆఫీసులో కునికిపాట్లు పడేవారు ఎందరో.. ఆ సమస్యను అధిగమించాలంటే ఈ కింది చిట్కాలు పాటించి నిద్రాదేవిని దూరంగా తరమేయండి..

    -మధ్యాహ్నసమయంలో నిద్రను కంట్రోల్ చేయడానికి సహజమైన పరిష్కారాలు ఉన్నాయి. మీరు కూర్చునే డెస్క్ దగ్గర స్వల్ప వ్యాయామాలు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

    Also Read: కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

    -మధ్యాహ్నం పనివేళల్లో నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మసాజ్ చేసుకోవడం ఉత్తమం. నుదురు శిఖరం, తల చుట్టూ చర్మాన్ని కొద్దిసేపు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తొలిగిపోయి మనసు తాజాగా ఉంటుంది.

    -నిద్రమత్తులో కూరుకుపోయిన మనసును సడలించేలా చేయాలంటే చిన్నగా భుజాన్ని తిప్పాలి. భుజాలను చిన్నగా పైకెత్తి , మెడను కదిలించండి. ఇలా రెండు నిమిషాలు చేస్తే రిలాక్స్‌గా ఉంటుంది.

    -ఆఫీసులో పగటి భోజనం ముగియగానే నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే, వెంటనే కుర్చీలోంచి లేచి కొద్దిదూరం చురుకైన నడకను ఆరంభించండి. ఐదు నుంచి పది నిమిషాలు అలా నడిస్తే నిద్రమత్తు కొంతవరకు తగ్గిపోతుంది.

    -కుర్చీలో నిటారుగా కూర్చుని శ్వాసను లోతుగా తీసుకుని వదులుతూ ఉండాలి. నాభిపై ఒత్తిడి కలిగిందని అనిపించేవరకు ఇలా చేస్తూనే ఉండాలి. రెండు, మూడు నిమిషాలు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.

    Also Read: కరోనా వ్యాక్సిన్ గురించి అదిరిపోయే శుభవార్త.. అద్భుత ఫలితాలిస్తున్న ఆ వ్యాక్సిన్..?

    -డెస్క్ దగ్గరే కూర్చుని కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా నిద్రమత్తును నియంత్రించవచ్చు.

    -ఒకే స్థానంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శక్తిస్థాయి తగ్గుతుంది. కాబట్టి మెడ వ్యాయామం చేస్తే అవసరమైన శక్తిని అందుతుంది. నిద్ర తేలిపోతుంది.