
దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్స్. పవర్ స్టార్.. హరీష్ శంకర్.. బండ్ల గణేష్ కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ మూవీ వచ్చిన సంగతి తెల్సిందే. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి పవర్ స్టార్ స్టెమినాను మరోసారి తెలుగు ప్రేక్షకులకు చూపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఈ మూవీ హిట్టు తర్వాత వీరి కాంబినేషన్లో మరో మూవీ వస్తుందని అంతా భావించారు. అయితే ఇప్పటివరకు ఆ కాంబినేషన్ సెట్టకాలేదు. అయితే ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్.. నిర్మాత బండ్ల శంకర్ మధ్య మాటలయుద్ధం కొనసాగింది. గబ్బర్ సినిమా ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా హరీష్ శంకర్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లెటర్ విడుదల చేశాడు.
Also Read: హీరో గోపీచంద్ లైఫ్ హిస్టరీ.. ఆసక్తికర విషయాలివీ!
అయితే అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరు మిస్ అవడంతో నిర్మాత బండ్ల గణేష్ హార్ట్ అయ్యాడు. ఇకపై హరీష్ శంకర్ తో సినిమాలు చేయనని ప్రకటించాడు. దీంతో వీరిమధ్య కొన్నిరోజులు మాటయుద్ధం జరిగింది. అయితే ఇటీవల బండ్ల గణేష్ కరోనా బారిన పడినపుడు హరీష్ శంకర్ స్పందించాడు. అతడంటే తనకు ఎప్పుడు గౌరవమేనని.. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకున్నందుకు హ్యపీ అంటూ ట్వీటర్లో స్పందించాడు. దీంతో ఈ వివాదం అక్కడితో ముగిసింది.
Also Read:రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత..ఏమన్నారంటే?
తాజాగా బండ్ల గణేష్ సైతం సోషల్ మీడియాలో హరీష్ శంకర్ కు క్షమాపణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తాడో లేదో అనుకుంటుండగా ఊహించని విధంగా కామెంట్ చేసి అందరికీ షాకిచ్చాడు. సార్ దయచేసి మీరు అనకండి.. మీరు నా బ్రదర్ లాంటివాళ్లు.. నా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్.. సినిమా మనకంటే గొప్పది.. అందుకే గొప్ప సినిమాలతో మనం మరింత గొప్పగా జీవించాలంటూ ట్వీట్ చేశాడు. వీరిమధ్య వివాదాలు తొలగడంతో త్వరలోనే ఈ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.