https://oktelugu.com/

హీరో  గోపీచంద్ లైఫ్ హిస్టరీ.. ఆసక్తికర విషయాలివీ!

టాలీవుడ్ హీరో గోపీచంద్ సినీ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగింది. ముందుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ కు అవకాశాలు రాకపోవడంతో ‘జయం’ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వర్షం సినిమాలోనూ విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగు సినిమాకు మరో సరికొత్త విలన్ దొరికాడని అంతా భావిస్తున్న సమయంలోనే మళ్లీ హీరోగా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్నా ఒకటి ఆరా తప్పితే ఆయన సినిమాలకు అంతగా ప్రేక్షకాదరణ రావడం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 04:18 PM IST
    Follow us on

    టాలీవుడ్ హీరో గోపీచంద్ సినీ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగింది. ముందుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ కు అవకాశాలు రాకపోవడంతో ‘జయం’ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వర్షం సినిమాలోనూ విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగు సినిమాకు మరో సరికొత్త విలన్ దొరికాడని అంతా భావిస్తున్న సమయంలోనే మళ్లీ హీరోగా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్నా ఒకటి ఆరా తప్పితే ఆయన సినిమాలకు అంతగా ప్రేక్షకాదరణ రావడం లేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    హీరో గోపీచంద్.. ప్రముఖ దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ గారి రెండవ అబ్బాయి. తొట్టెంపూడి కృష్ణ విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. సమాజం మీద సినిమాలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఆయన రెండో కుమారుడు హీరో గోపీచంద్.. ఇక గోపీచంద్ వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే అప్పట్లో ఓ పెళ్లి నిశ్చితార్థం వరకూ వెళ్లింది. ఎందుకో అది క్యాన్సల్ అయ్యింది. ఆయన చేసుకోబోయే అమ్మాయి సూసైడ్ అంటెంప్ట్ చేసిందనే వార్తలు వెలువడ్డాయి. ఆ వివాదం ముగిశాక.. గోపీచంద్ 2013 మే 12న రేష్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ గోపీచంద్ వైఫ్ రేష్మ గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాలున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

    Also Read: రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత..ఏమన్నారంటే?

    రేష్మ ఎవరో కాదు.. ప్రముఖ హీరో శ్రీకాంత్  కు స్వయానా మేనకోడలు.. శ్రీకాంత్ సొంత అక్క కూతురిని గోపీచంద్ కి ఇచ్చి వివాహం జరిపించారు. గోపిచంద్ రేష్మకి బాబు పుట్టాడు. అతడి పేరు విరాట్ అని పేరు పెట్టారు. ఆ పేరును భార్య కోరిక మేరకే గోపిచంద్ తన కొడుకుకు పెట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

    Also Read: హీరోయిన్ సుమలత ఎవరి కూతురు.? ఎవరిని చేసుకుందో తెలుసా?

    రేష్మీ చాలా పెద్ద చదువులు అమెరికాలో చదువుకొని వచ్చింది. గోపీచంద్ వయసు 38 ఏళ్లు కాగా.. అతని భార్య రేష్మ వయసు 30. గోపీంచంద్ రేష్మని ఫొటోస్ లో చూసి ఇష్టపడి  సంబంధం మాట్లాడమని చెప్పాడట.. గోపిచంద్ పెళ్లి మధ్యవర్తిగా వ్యవహరించింది సీనియర్ యాక్టర్ చలపతిరావు గారు.. గోపీచంద్ తన కంటే మంచోడు అని.. కళ్లు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చని స్వయంగా హీరో శ్రీకాంత్ చెప్పడంతో వీరి పెళ్లి పీటలమీదకు చేరిందట..