https://oktelugu.com/

Fruits : ఏ పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసా?

పండ్లు తినడం వల్ల అత్యధిక ప్రయోజనాలు ఇచ్చేవాటిలో బొప్పాయి ముందు ఉంటుంది. ఒకప్పుడు ఇవి మార్కెట్ కు తక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఇవి కచ్చితంగా తీసుకోవాలని కొందరు వైద్యులు చెబుతుండడంతో వీటికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. బొప్పాయి పండులో బీటీ క్రిపోక్రాంథిన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 6:32 pm
    Eating fruits

    Eating fruits

    Follow us on

    Fruits :  ప్రపంచంలో ప్రకృతి అదించే ఎన్నో ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. రోజూ వార తినే ఆహారంతో పాటు వీటిని కూడా తీసుకోవడం వల్ల అదనపు శక్తి వస్తుంది. ముఖ్యంగా అడవిలో లభించే పండ్లతో శరీరానికి అధిక ప్రయోజనాలు ఉంటాయి. సహజ సిద్ధంగా లభించే పండ్లలో అనేక విటమిన్స్, కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. అందువల్ల వీటికి అప్పుడప్పుడు తీసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. కొన్ని రకాల పండ్లల్లో వ్యాధులను నయం చేసే గుణాలు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే పోషకాలతో రోగనిరోధక శక్తి పెరుగుతంది. జీర్ణక్రియను పెంపొందించడంలో ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. అయితే నేటికాలంలో మార్కెట్లో లభించే పండ్లు కలుషితంగా మారుతున్నాయి. ఇవి పక్వానికి రావడానికి రసాయనాలు చల్లడంతో వాటిని తినడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కొన్నిరకాల పండ్లలో ప్రత్యేక గుణాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల నిత్యం ఆరోగ్యం ఉంటారని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లు ఏవో తెలుసుకుందాం..

    పండ్లు తినడం వల్ల అత్యధిక ప్రయోజనాలు ఇచ్చేవాటిలో బొప్పాయి ముందు ఉంటుంది. ఒకప్పుడు ఇవి మార్కెట్ కు తక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఇవి కచ్చితంగా తీసుకోవాలని కొందరు వైద్యులు చెబుతుండడంతో వీటికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. బొప్పాయి పండులో బీటీ క్రిపోక్రాంథిన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పపెయిన్ అనే ఎంజైమ్ జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం లాగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే సమయంలో బొప్పాయి పండును అధికంగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు.

    మార్కెట్లో ఎక్కువ పోషకాలు ఉన్న ప్రూట్స్ లో దానిమ్మ ఒకటి. ఇవి మిగతా వాటి కంటే కాస్త అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్లఅధిక ప్రయోజనాలు ఉంాయి. దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కె తో పాటు ఇతర గుణాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల అల్జీమర్స్ దూరమవుతుంది. అలాగే ఇది మెదడు వాపు వ్యాధి రాకుండా చేస్తుంది. అందువల్ల అంతేకాకుండా తీవ్ర జ్వరం ఉన్న సమయంలో దానిమ్మ ను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి వస్తుంది.

    మార్కెట్లో లభించే నల్ల ద్రాక్షకు అధిక డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకునే కారకాలు ఉంటాయి. ద్రాక్షలో యాంటి యాక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె సమస్యలు అధికంగా ఉన్నవారు వీటిని తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ద్రాక్షలో పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. ద్రాక్షపండును నేరుగా తీసుకోవడం ఇబ్బందిగా మారితే దీనిని జ్యూస్ ద్వారా తీసుకోవాలి.

    మార్కెట్లోనే కాకుండా ఇళ్లల్లోనూ అందుబాటులో ఉండే పండు జామ. జామలో విటమిన్ ఏ, విటమిన్ బి, క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో మిగతా వాటికంటే అధికగా ఫైబర్ ఉంటుంది. వీటిని తరుచుగా తీసుకుంటూ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుుతుంది.