Dandruff: చుండ్రు ఎక్కువగా ఇబ్బంది పెడుతోందా.. చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

Dandruff:  ఈ మధ్య కాలంలో మహిళలు, పురుషులు అనే తేడాల్లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్యలలో చుండ్రు ఒకటనే సంగతి తెలిసిందే. కాలుష్యం, పోషకాహార లేమి ఇతర కారణాల వల్ల చుండ్రు సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చుండ్రు వల్ల జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు పొడిబారటం కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మార్కెట్ లో చుండ్రుకు చెక్ పెట్టే ఉత్పత్తులు ఉన్నా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ […]

Written By: Navya, Updated On : February 25, 2022 12:49 pm
Follow us on

Dandruff:  ఈ మధ్య కాలంలో మహిళలు, పురుషులు అనే తేడాల్లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్యలలో చుండ్రు ఒకటనే సంగతి తెలిసిందే. కాలుష్యం, పోషకాహార లేమి ఇతర కారణాల వల్ల చుండ్రు సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చుండ్రు వల్ల జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు పొడిబారటం కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మార్కెట్ లో చుండ్రుకు చెక్ పెట్టే ఉత్పత్తులు ఉన్నా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Dandruff

చుండ్రు సమస్యతో బాధ పడేవాళ్లు ఉల్లిపాయ రసంలో ఆముదం కలిపి తలకు రాసుకుంటే సమస్య దూరమవుతుంది. జుట్టుకు ఈ రసాన్ని రాసిన తర్వాత కనీసం అరగంట సమయం అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వేప నూనె, నిమ్మరసం మిశ్రమాన్ని తలకు పట్టించడం ద్వారా కూడా చుండ్రు సమస్య దూరమవుతుంది. వారానికి ఈ విధంగా రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచిది.

Also Read: కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎంట్రీ కావాలంటే?

ఆలివ్ ఆయిల్ కు, పెరుగును జోడించి తలకు మసాజ్ చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వారానికి ఈ విధంగా రెండుసార్లు చేయడం వల్ల చుండ్రు సమస్యలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నిమ్మరసం, కొబ్బరినూనెలను మిశ్రమంలా తయారు చేసుకొని తలకు పట్టించి చేతులతో మసాజ్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం ద్వారా చుండ్రు సమస్య దూరమవుతుంది.

నేచురల్ హెయిర్ ఆయిల్స్ సహాయంతో ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. నేచురల్ హోం రెమిడీస్ వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

Also Read: ఇండస్ట్రీ పెద్దల మౌనాన్ని ఈ ఒక్క ట్వీట్ తో పవన్ కడిగేశాడా?

Recommended Video: