https://oktelugu.com/

Naltrexone: ఈ ఒక్క టాబ్లెట్ వేసుకుంటే.. అసలు జన్మలో మద్యం జోలికి పోరు

మద్యం తాగడం వల్ల బాధలు మర్చిపోవచ్చని, సంతోషంగా ఉండవచ్చని భావించి అలా ఎక్కువగా తాగి మద్యానికి బానిస అవుతారు. మద్యం నుంచి విముక్తి కల్పించాలని ఎంత ట్రై చేసిన కూడా కాలేరు. అయితే కేవలం ఒక్క టాబ్లెట్‌తో మద్యం నుంచి విముక్తి పొందవచ్చు. అదెలాగో మరి తెలియాలంటే మీరు ఆర్టికల్ చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 23, 2024 / 01:20 AM IST

    Naltrexone

    Follow us on

    Naltrexone: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసిన కొందరు మానరు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కొందరు తాగుతుంటారు. ఆల్కహాల్‌కి బాగా బానిస అయ్యి తాగుతారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే సంతోషం కలిగిన, బాధ కలిగిన కూడా మద్యం సేవిస్తుంటారు. ఈ రోజుల్లో పురుషులతో పాటు అమ్మాయిలు కూడా తాగుతున్నారు. మద్యం తాగడం వల్ల అనారోగ్య బారిన పడతారని, ప్రాణాల మీదకు వస్తుందని వైద్యులు చెప్పిన పట్టించుకోరు. ఫ్రెండ్స్‌తో పార్టీ లేదా ఏదో వీకెండ్ సమయాల్లో అంటే పర్లేదు. కానీ డైలీ అదే పనిగా తాగుతుంటారు. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన మానలేకపోతుంటారు. మద్యం తాగడం వల్ల బాధలు మర్చిపోవచ్చని, సంతోషంగా ఉండవచ్చని భావించి అలా ఎక్కువగా తాగి మద్యానికి బానిస అవుతారు. మద్యం నుంచి విముక్తి కల్పించాలని ఎంత ట్రై చేసిన కూడా కాలేరు. అయితే కేవలం ఒక్క టాబ్లెట్‌తో మద్యం నుంచి విముక్తి పొందవచ్చు. అదెలాగో మరి తెలియాలంటే మీరు ఆర్టికల్ చదివేయండి.

     

    మద్యానికి ఎక్కువగా బానిస అయ్యే వారు నాల్ట్రెక్సోన్ అనే మాత్రలు వాడితే తొందరగా విముక్తి చెందుతారు. ఈ పిల్ వేసుకోవడం వల్ల మద్యం తాగాలన్నా కోరికను తగ్గిస్తుంది. పూర్తిగా మద్యంపై ఉండే ఆలోచనలను తగ్గిస్తుంది. అసలు మీకు మద్యం తాగాలన్నా ఇంట్రెస్ట్ కూడా రాదు. దాని మీదకి మనస్సు కూడా మల్లదు. దీంతో రాను రాను పూర్తిగా మద్యం తాగాలన్నా ఆలోచన నుంచి విముక్తి పొందుతారు. మద్యం ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధికారక ప్రమాదాల బారిన పడతారు. కాబట్టి అధికంగా తాగుతున్నట్లయితే ఒక్కసారి ఈ టాబ్లెట్ వేసుకుంటే చాలు.. ఇక జన్మలో మళ్లీ మద్యం జోలికి పోరు. మద్యం ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్‌తో పాటు ఊపిరితిత్తుల సమస్యల బారిన పడతారు. అలాగే శరీరంలో ఉండే రక్తాన్ని కూడా మద్యం పీల్చేస్తుంది.

     

    కొందరు పూర్తిగా మద్యానికి బానిస అయ్యే ఆహారం మీద దృష్టి పెట్టరు. పూర్తిగా అసలు ఫుడ్ తినరు. మద్యం ఎఫెక్ట్, ఫుడ్ తినకపోవడం రెండు ఒకసారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటివల్ల తొందరగా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా మద్యం తాగడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అలాగే క్యాన్సర్, డయాబెటిస్, గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. డైలీ మద్యం సేవించడం వల్ల బాడీ మొత్తం ఆల్కహాల్‌తో నిండిపోతుంది. దీంతో శరీరంలోని ఎముకలు బలహీనం అవుతాయి. కాబట్టి ఎక్కువగా మద్యానికి బానిస కావద్దు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.