Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. వరాలు కురిపిస్తున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు ప్రముఖులను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ఇక వ్యక్తిగత విమర్శలు కూడా మొదలు పెట్టారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సెటిలర్ల ఓట్లు కూడా పొందేందుకు వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. అయితే ఈ ఇంటర్వ్యూ అమెరికన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ట్రంప్ ఈ వీడియోపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ వీడియో పూర్తిగా ఎడిట్ చేసినందని, ఒరిజినల్ వీడియోను విడుదల చేయలేదని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను విడుదల చేసిన మీడియా సంస్థకు లేఖ కూడా రాశారు. ఎడిట్ చేయని వీడియో విడుదల చేయాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏం జరిగిందంటే..?
అమెరికన్ మీడియా సంస్థ సీబీఎన్ కమలా హారిస్ ఇంటర్వ్యూను ఎడిట్ చేసిందని ట్రంప్ ఆరోపించారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె అడిగిన ప్రశ్నకు మీడియా సంస్థ రెండు సమాధానాలను ప్రసారం చేసిందని పేర్కొన్నారు. హారిస్ సామర్థ్యం తెలివితేటల విషయంలో ఓటర్లలో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో మార్పులు చేశారని పేర్కొన్నారు. ఓటర్లను తప్పుదారి పట్టించాలని చూసుత్నా ్నరని మండిపడ్డారు. ఈమేరు సీబీఎన్‌కు లేఖ రాశారు. మీడియా సంస్థ మాత్రం ట్రంప్ ఆరోపణలను కొట్టిపారేసింది.
సోషల్ మీడియాలో వీడియో..
సీబీఎన్ కమలా హారిస్ ఎప్పుడూ విడుదల చేస్తుంది. ఆమెను తెలివైన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇంటర్వ్యూలో కమల చెప్పిన సమాధానం కాకుండా మరో సమాధానం కూడా జోడించారు బ్రాడ్‌కాస్ట్ ఇండస్ట్రీలో అతిపెద్ద మోసం ఇదే రెండు వాక్యాలను కలిపి సమాధానం చెప్పలేని స్థితిలో హారిస్ ఉన్నారు. ఆనిని తొలగించి కొత్త సమాధానం ప్రసారం చేశారు.ఆమెరు రక్షించడానికి అసేం మార్చారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంది. ఆమె ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టుతో వివాదం మొదలైంది.