drink alcohol : ప్రపంచంలో మొట్టమొదట మద్యం తాగిన వ్యక్తి ఎవరు అని ఎప్పుడైనా థింక్ చేశారా? . అయితే చైనీయులే మొదట సారా తాగారు అని సమాచారం. చైనాలో 7,000 BC నాటికి బజ్రాతో తయారు చేసిన మద్యం ఆనవాళ్లు కనిపించాయట. జియాహు పట్టణంలో మట్టి కుండల్లో మద్యం అవశేషాలు కనుగొన్నారు నిపుణులు. అంతేకాదు జార్జియాలో కూడా మద్యం ఆనవాళ్లు ఉన్నాయట. యూరప్‌లోని పురాతన మద్యం జార్జియాలో కనుగొన్నారట. 6,000 BC నాటి ద్రాక్ష కిణ్వ ప్రక్రియ ద్వారా దీన్ని తయారు చేశారని సమాచారం.
ఇరాన్‌లో 5,400 BC నాడే మద్యం ఉండేదని టాక్. అయితే ఇక్కడ జాగ్రోస్ కొండల్లో 5,400 BC నాటి మద్యం ఆనవాళ్లు కనిపించాయి అని అధ్యయనంలో తేలింది. ఇక్కడ మట్టి కుండల్లో ద్రాక్ష కిణ్వ ప్రక్రియ అవశేషాలను కనుగొన్నారట.
పురాతన ఈజిప్టులో కూడా మద్యం ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ ద్రాక్ష, బార్లీ తో మద్యం తయారు అవుతుంది. ఈజిప్టు శాసనాలలో మందు తయారీ ప్రక్రియకు సంబంధించి ఆధారాలు కనుగొన్నారు.
పురాతన మెసొపొటేమియా (ఆధునిక ఇరాక్)లో బీర్, మద్యం ఆనవాళ్లు ఉన్నాయట. ఇక్కడ బార్లీ నుంచి బీర్ తయారు చేశారట. అంతేకాదు దీన్ని మతపరమైన కార్యక్రమాల్లో వినియోగించారు కూడా. ఇక భారతదేశం విషయానికి వస్తే వేదకాలం నుంచి సోమరసం, సురాపానం వాడారట. మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో ఉపయోగించారు. పురాతన గ్రీస్, రోమ్‌లలో మద్యం ఉనికి గుర్తించారు. ఇక్కడ మద్యంతో దేవుడు డయోనిసస్‌ను పూజించేవారు అని సమాచారం. రోమ్‌లో కూడా మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో మద్యం మస్ట్ గా ఉండేదట.
అర్మేనియాలో 4,100 BC నాటి మద్యం పురాతన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు శాస్త్రవేత్తలు. జర్మనీలోని రైన్‌ల్యాండ్ ప్రాంతంలో 1867లో తవ్వకాల సమయంలో శతాబ్దాల నాటి (పదిహేడు శతాబ్దాలు) మద్యం సీసా దొరికిందట. అంటే ఈ మద్యం ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటి నుంచో రాజ్యాలను ఏలుతుందన్నమాట. మరి ఇకనైనా కాస్త మీరు కంట్రోల్ చేసుకోవచ్చు కదా. దీని వల్ల వచ్చే చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.