Lord Shiva: హిందువులు పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు ఒకరు. శివుడిని పూజించే వాళ్లు కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదు. ఈ తప్పులు చేస్తే మాత్రం అనుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంట్లో శివలింగం పెట్టుకుని పూజించే వాళ్లు జలధార కచ్చితంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శివలింగం అభిషేకం కోసం స్టీల్ స్టాండ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించడం మంచిది కాదు.
జలధార లేకుండా శివలింగంను పెట్టుకుంటే నెగిటివ్ ఫలితాలే కలిగే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. శివునికి ఏ పూలతో పూజ చేసినా సంపంగి పూలతో మాత్రం పూజ చేయకూడదు. సంపంగి పూలతో పూజ చేయడం వల్ల నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శివునికి ఇతర పండ్లతో పోలిస్తే వెలగపండు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: Telangana BJP: పదవి లేకపోతే ఫైర్ తగ్గుతుందా.. బీజేపీలో ఆ ముగ్గురికి ఏమైంది..?
శివలింగంపై కొబ్బరినీళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. కొబ్బరి నీళ్లు వేయడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. శివుడిని పూజించే సమయంలో కుంకుమకు బదులుగా గంధం సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే పౌర్ణమి, అష్టమి, నవమి, అమవాస్య, మకర సంక్రాంతి రోజులలో బిల్వ పత్రాలను సమర్పించడం మంచిది కాదు.
సోమవారం రోజున శివుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. శివపూజ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం అనుకూల ఫలితాలు రావు. సరైన విధంగా శివుడిని పూజించిన భక్తులకు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: Radhika: హిందూగా పుట్టి ముస్లిం ఫ్యామిలీలో పెరిగిన రాధిక.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Recommended Videos: