https://oktelugu.com/

Tv Anchors: బుల్లితెర స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Tv Anchors: బుల్లితెర షోల ద్వారా సుమ కనకాల, రష్మీ గౌతమ్, అనసూయ, ప్రదీప్, రవి మరి కొందరు యాంకర్లు ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ యాంకర్లలో కొంతమంది యాంకర్లు ఈవెంట్లకు హోస్ట్ లుగా వ్యవహరిస్తూ భారీ మొత్తం సంపాదించుకుంటున్నారు. తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల కాగా ఆమె స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మరో యాంకర్ లేరనే సంగతి తెలిసిందే. సుమ కనకాల ఒక్కో ఈవెంట్ కు రెండున్నర లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 20, 2022 / 12:23 PM IST
    Follow us on

    Tv Anchors: బుల్లితెర షోల ద్వారా సుమ కనకాల, రష్మీ గౌతమ్, అనసూయ, ప్రదీప్, రవి మరి కొందరు యాంకర్లు ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ యాంకర్లలో కొంతమంది యాంకర్లు ఈవెంట్లకు హోస్ట్ లుగా వ్యవహరిస్తూ భారీ మొత్తం సంపాదించుకుంటున్నారు. తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల కాగా ఆమె స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మరో యాంకర్ లేరనే సంగతి తెలిసిందే. సుమ కనకాల ఒక్కో ఈవెంట్ కు రెండున్నర లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.

    Tv Anchors

    సుమ టీవీ షోలకు కూడా దాదాపుగా ఇదే మొత్తం తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరో బుల్లితెర టాప్ యాంకర్ అయిన రవి ఒక్కో ఈవెంట్ కు లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. షోలకు కూడా రవికి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ దక్కుతోంది. మరో టాలీవుడ్ యాంకర్ మంజూష ప్రస్తుతం టీవీ షోలకు 30,000 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

    Also Read: Telangana BJP: ప‌ద‌వి లేక‌పోతే ఫైర్ త‌గ్గుతుందా.. బీజేపీలో ఆ ముగ్గురికి ఏమైంది..?

    ఢీ షో ద్వారా పాపులర్ అయిన వర్షిణి కూడా మంజూష స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారని బోగట్టా. ఒకవైపు సినిమాలతో, మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉన్న శ్యామల 50,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మేల్ టాప్ యాంకర్ అయిన ప్రదీప్ లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. యాంకర్ రష్మీ రెమ్యునరేషన్ ఒక్కో ఈవెంట్ కు 1,50,000 రూపాయలకు అటూఇటుగా ఉందని బోగట్టా.

    మరో టాప్ యాంకర్ అనసూయ ఒక్కో ఈవెంట్ కు 2 లక్షల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు. అనసూయ సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీగా ఉన్నారు. శిల్పా చక్రవర్తి ఒక్కో ఈవెంట్ కు 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. శ్రీముఖి కూడా దాదాపుగా ఇదేస్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

    Also Read: RRR Komaram Bheem: RRR లో కొమురం భీమ్ పాత్రని వదులుకున్న హీరోలు వీళ్లేనా??

    Recommended Videos: