PM Modi and Joe Biden: జోబైడెన్ తో మోడీ భేటి ఫిక్స్.. ఏం జరుగనుంది?

PM Modi and Joe Biden: అంతర్జాతీయంగా సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతోంది. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ప్రస్తుతం కొనసాగుతున్న దుర్భర స్థితులు వేరుగా ఉంటున్నాయి. దీంతో దేశాల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు తమ మద్దతు కోసం పరితపిస్తున్నాయి. అది గ్లోబల్ వార్మింగ్ అయినా, తాలిబన్ల సమస్య అయినా, కరోనా నేపథ్యం కూడా కావచ్చు. కానీ ప్రపంచ దేశాల్లో సమన్వయం అవససరం ఏర్పడింది. అన్ని దేశాల […]

Written By: Srinivas, Updated On : September 21, 2021 12:19 pm
Follow us on

PM Modi and Joe Biden: అంతర్జాతీయంగా సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతోంది. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ప్రస్తుతం కొనసాగుతున్న దుర్భర స్థితులు వేరుగా ఉంటున్నాయి. దీంతో దేశాల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు తమ మద్దతు కోసం పరితపిస్తున్నాయి. అది గ్లోబల్ వార్మింగ్ అయినా, తాలిబన్ల సమస్య అయినా, కరోనా నేపథ్యం కూడా కావచ్చు. కానీ ప్రపంచ దేశాల్లో సమన్వయం అవససరం ఏర్పడింది. అన్ని దేశాల సహకారం అత్యవసరం అవుతోంది. దీంతో పలు దేశాలు ఒక కూటములుగా ఏర్పడడం తెలిసింది.

అమెరికా, జపాన్, ఆస్రేలియా, బ్రిటన్, ఇండియా దేశాలు కలిసి క్వాడ్ దేశాల సమాఖ్యగా ఏర్పడ్డాయి. దీంతో వాటి మధ్య సహాయ సహకారాల కోసం ఐకమత్యంగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం సెప్టెంబర్ 24న అమెరికా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య ఇరు దేశాధినేతల మధ్య సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యాయి. ఈ మేరకు అమెరికా వైట్ హౌస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

బైడెన్ తో జరిగే సమావేశంలో పలు చర్చలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిసింది. ద్వైపాక్షిక అంశాల్లో పలు రకాల సమస్యలపై అవగాహన రానున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో చోటుచేసుకునే పరిస్థితులు, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ తదితర విషయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాలపై పరిష్కారాలు లభించనున్నట్లు సమాచారం.

క్వాడ్ కూటమి సదస్సులో ప్రధాని మోడీ జపాన్ ప్రధాని యోషిహిడే సుగ, ఆస్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ లతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇండో-పసిఫిక్ సముద్రంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. చైనా తన కుయుక్తులతో ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గుర్తించడం లేదని తెలుస్తోంది. అందుకే క్వాడ్ వేదికగా సభ్య దేశాలు పోరాటం సాగించేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు.

మరో వైపు ప్రపంచంలో సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ లో భాగంగా ప్రపంచంలోని భూభాగం వేడెక్కిపోతోందని తెలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కంటకంగా మారుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల సమస్యలు కూడా పట్టించుకుని గ్లోబల్ వార్మింగ్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.