Sleep Tips: మనిషికి ఆహారంతో పాటు సరైన నిద్ర చాలా అవసరం. కానీ ప్రస్తుత రోజుల్లో రకరకాల ఒత్తిడిల వలన చాలామంది సరైన నిద్రపోవడం లేదు. ఒకవేళ నిద్రించినా కూడా ఆరోగ్యకరంగా ఉండడం లేదు. అందుకు కారణం ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ విధుల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ వంటి సమస్యలతో రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఈ కారణంగా నిద్ర గడియారం చెడిపోయి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే త్వరగా నిద్ర పట్టడానికి అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఒక టెక్నిక్ యూస్ చేస్తారు. దీనిని మీరు కూడా ప్రయత్నిస్తే త్వరగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. మరి ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
నిద్రపోవాలని చాలామందికి ఉంటుంది. కానీ బెడ్ పైకి వెళ్ళగానే ఏదో రకమైన ఆలోచనలు ఉంటాయి. కొందరికి ఆరోగ్య సమస్యల వల్ల త్వరగా నిద్ర పట్టదు. మరికొందరికి మానసికంగా ఇబ్బందులు ఉండడం వల్ల మనసులోకి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొందరు మద్యపానానికి అలవాటు పడతారు. మరికొందరు మొబైల్ చూస్తూ నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల త్వరగా నిద్ర వస్తుందని అనుకుంటారు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. లాంగ్ లైఫ్ లో మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే యోగ వంటివి చేస్తే ప్రయోజనాలు ఉంటాయి. కానీ చాలామందికి ఆ ఆసక్తి ఉండడం లేదు. దీంతో అమెరికన్ మిల్ట్రీ టెక్నిక్ వాడొచ్చని కొందరు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన మిలటరీ వాళ్లు ఎప్పుడు స్ట్రెస్ తో ఉంటారు. వీరు త్వరగా నిద్రించేందుకు ఒక టెక్నిక్ వాడుతారు. మీరు నిద్రించాలని అనుకున్నప్పుడు ముందుగా మెదడును ప్రశాంతంగా మార్చుకుంటారు. అంటే అప్పటి వరకు ఉన్న ఆలోచనలు పక్కనపెట్టి కళ్ళు మూసుకొని ఒకే దృష్టితో ఉంటారు. ఆ తర్వాత మొహం, దవడలు రిలాక్స్ చేస్తారు. అంటే ఎలాంటి మాటలు మాట్లాడకుండా.. ఏ విధమైన ఫేస్ కదలిక లేకుండా చేస్తారు. ఆ తర్వాత భుజాలను కిందికి వాలుస్తారు. అంటే అప్పటివరకు పైకి ఉన్న చేతులను కిందికి రిలాక్స్గా వదులుతారు. ఆ తర్వాత నడుము కాళ్ళను ఇలా రిలాక్స్గా చేస్తారు. అంటే అప్పటివరకు కాళ్ళ కదలిక ఉంటే ఆపేస్తారు.
ఇలా తల నుంచి కాళ్ల వరకు ఒక్కొక్కటిగా రిలాక్స్ చేస్తూ వస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం మొత్తం ఒకే స్థితిలో ఉండి ఎటువంటి వేరే ఆలోచనలను రాలకుండా ఉంటాయి. దీంతో త్వరగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. వారు ఇలా చేయడం వల్లే సరైన నిద్రపోయి నిత్యం యాక్టివ్ గా ఉంటారు. సరైన నిద్ర పట్టలేదు అని అనుకునే వారికి ఇలాంటి ప్రయోగం చేయడం వల్ల సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు.