Loans on Silver: బ్యాంకు రుణం కావాలంటే ఒకప్పుడు రకరకాల డాక్యుమెంట్స్ అడిగేవారు. వారి గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేసిన తర్వాత రుణం మంజూరు చేసేవారు. ఆ తర్వాత క్రెడిట్ కార్డు పైన రుణం ఇస్తున్నారు. ఇంకాస్త అభివృద్ధి జరిగే బంగారు ఆభరణాలపై లోన్ ఇస్తున్నారు. బంగారం ధర విపరీతంగా పెరగడంతో వీటిపై లోన్ పరిమితిని కూడా పెంచారు. అయితే ఇప్పుడు కొత్తగా వెండిపై కూడా రుణాలు ఇచ్చేందుకు Reserve Bank of India (RBI) కీలక నియమాలను జారీ చేసింది. ప్రస్తుతం బంగారంతో పాటు వెండి ధర విపరీతంగా పెరిగింది. కిలో వెండి దాదాపు రెండు లక్షల రూపాయల చేరువకు వచ్చింది. దీంతో వెండిపై కూడా రుణం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ రుణాలు ఎప్పుడు ఇస్తారు? ఎవరికి ఇస్తారు?
2026 ఏడాదిలో ఏప్రిల్ ఒకటి నుంచి వెండి పై కూడా రుణాలు ఇవ్వాలని ఆర్బిఐ ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. వెండి పై లోన్ తీసుకునే సమయంలో వెండి ధరలో 85% వరకు లోన్ ఇస్తారు. అంటే లక్ష రూపాయల విలువ అయిన వెండి ఆభరణాలు ఉంటే వాటిపై రూ.85,000 రుణం ఇస్తారు. అయితే ఇలా రూ. 2.5 లక్షల వరకు పరిమితి ఉంటుంది. అంతకుమించి అంటే రూ. నాలుగు లక్షల వరకు లోన్ తీసుకుంటే 80 శాతం వరకు లోన్ పొందవచ్చు.రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వెండిపై రుణం తీసుకోవాలని అనుకుంటే 75% లోన్ ఇస్తారు. అయితే ఈ రుణం పొందేవారు తమ సిబిల్ స్కోర్ బాగుండాలి.
వెండి పై రుణాలు తీసుకోవాలని అనుకునేవారు చిన్న లేదా మధ్యతరహా వ్యాపారస్తులు అయి ఉండాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు వెండి పై రుణాలు తీసుకోవచ్చు. వెండి పై రుణం తీసుకునేవారు తమ సొంతది అయినట్లుగా ధ్రువీకరించాలి. వెండి కడ్డీలపై రుణం ఇవ్వరు. ఆభరణాలపై మాత్రమే లోన్ ఇస్తారు. అంతేకాకుండా ఆన్లైన్ లేదా ఈటీఎఫ్ వంటి వాటిపై కూడా రుణం మంజూరు చేసే అవకాశం లేదు. గరిష్టంగా ఒక వ్యక్తి 10 కిలోల వెండి ఆభరణాలను మాత్రమే తాకట్టు పెట్టవచ్చు. అయితే వెండి నాణేలపై రుణం తీసుకోవచ్చు. ఇవి 500 గ్రాములు మాత్రమే ఉండాలి.
ప్రస్తుతం బంగారం పై ఇలాంటి మార్గదర్శకాలే ఉన్నాయి. అయితే బంగారం తో పాటు వెండి ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఈ లోహం ఆభరణాలపై కూడా రుణాలు ఇవ్వాలని నిర్ణయించాయి. వెండిపై రుణాలు ఇవ్వడంతో రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మార్గదర్శకాలు 2026 ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది. కొత్త నియమాల ప్రకారం బ్యాంకులు, NBFC, ఫైనాన్స్ కంపెనీలు రుణాలను మంజూరు చేస్తాయి. అర్బన్ బ్యాంకుల్లో కూడా ఈ అవకాశం ఉంటుంది.