https://oktelugu.com/

పానీ పూరీ తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే వాంతికే..?

దేశంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టమైన వాటిలో పానీపూరీ ఒకటి. చాలామంది పానీపూరిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం పానీపూరీ తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. గతంలో ఒక వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో టీ తయారీ కోసం టాయిలెట్ వాటర్ ను వాడిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో సైతం అదే తరహా ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో కొల్హాపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి ముంబైకి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 7, 2020 / 06:41 PM IST
    Follow us on


    దేశంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టమైన వాటిలో పానీపూరీ ఒకటి. చాలామంది పానీపూరిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం పానీపూరీ తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. గతంలో ఒక వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో టీ తయారీ కోసం టాయిలెట్ వాటర్ ను వాడిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో సైతం అదే తరహా ఘటన చోటు చేసుకుంది.

    మహారాష్ట్రలో కొల్హాపూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి ముంబైకి స్పెషల్ పానీ పూరీ వాలా పేరుతో పానీపూరీలను విక్రయిస్తాడు. అతని దగ్గర రోజూ పానీ పూరీ తినే కస్టమర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ వ్యక్తి పానీపూరీ కోసం టాయిలెట్ వద్ద నుంచి పట్టుకొస్తున్న నీళ్లను కలుపుతున్నాడని తెలిసి అవాక్కవ్వడం అక్కడి స్థానికుల వంతయింది. అతను టాయిలెట్ నుంచి నీటిని పట్టుకొస్తూ పానీ పూరీ తయారీలో వినియోగించే వాటిలో కలుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రతిరోజూ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తినే పూరీలో ఆ వ్యాపారి అలాంటి నీరు కలుపుతున్నాడని తెలిసి కొందరు స్థానికులు అతడిని చితక్కొట్టారు. అతని బండిని ధ్వంసం చేయడంతో పాటు పానీ పూరీని సామాగ్రినంతా పడేశారు. బాగా దెబ్బలు తగిలిన ఆ వ్యక్తి ఎంతో కష్టపడి వాళ్ల నుంచి తప్పించుకున్నాడు.

    ఇలాంటి ఘటనల వల్ల చాలామంది రోడ్ సైడ్ ఫుడ్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. బయట ఫుడ్ తినే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ తినకపోతే మంచిదని చెబుతున్నారు.