తక్కువ వడ్డీకే రూ. 15 లక్షల రుణం.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

ఈ మధ్య కాలంలో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీలతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్పు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే పలు సందర్భాల్లో బ్యాంకులు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా అత్యుత్తమ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ వడ్డీకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల రుణం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కస్టమర్లు ఈ […]

Written By: Navya, Updated On : November 7, 2020 6:18 pm
Follow us on


ఈ మధ్య కాలంలో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీలతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్పు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే పలు సందర్భాల్లో బ్యాంకులు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా అత్యుత్తమ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

తక్కువ వడ్డీకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల రుణం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కస్టమర్లు ఈ రుణాన్ని బ్యాంకుకు కూడా వెళ్లకుండా సులభంగా పొందే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తూ ఉండటం గమనార్హం. దీపావళి పండుగ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రుణాలకు 10.49 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. మిగతా బ్యాంకుల వడ్డీరేట్లతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తోంది.

యాక్సిస్ బ్యాంక్ నుంచి 50 వేల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు రుణంగా పొందవచ్చు. ఆన్ లైన్ లో ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం తీసుకున్న తరువాత 12 నెలల నుంచి 60 నెలలలోపు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. అందువల్ల రుణం కావాలనుకున్న వాళ్లు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిది.

దీపావళి పండగ తర్వాత ఆఫర్లు ఉండవని బ్యాంకులు తెలుపుతున్నాయి. పండగ సందర్భంగా ఒక్కో బ్యాంక్ ఒక్కో తరహా ఆఫర్లను ఇస్తోంది. అందువల్ల అన్ని ఆఫర్లను చెక్ చేసుకుని ఉత్తమమైన ఆఫర్లను ఎంచుకుంటే మంచిది.