https://oktelugu.com/

ఆడియో వైరల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతులు.. యువకుడు కడిగేశాడు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ యువకుడికి ఫోన్ చేసి బూతులు తిట్టాడు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రశ్నించినందుకు బండ బూతులు (రాయడానికి వీలులేని పదజాలం)తో యువకుడిపై ఫైర్ అయ్యారు. ఆ మాటలను తట్టుకోలేకపోయిన యువకుడు కూడా ఎమ్మెల్యేకు అంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బూతులు.. యువకుడి రెచ్చిపోయిన తీరు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 07:09 PM IST
    Follow us on

    టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ యువకుడికి ఫోన్ చేసి బూతులు తిట్టాడు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రశ్నించినందుకు బండ బూతులు (రాయడానికి వీలులేని పదజాలం)తో యువకుడిపై ఫైర్ అయ్యారు. ఆ మాటలను తట్టుకోలేకపోయిన యువకుడు కూడా ఎమ్మెల్యేకు అంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బూతులు.. యువకుడి రెచ్చిపోయిన తీరు చర్చనీయాంశంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఎమ్మెల్యే రసమయి తాజాగా రాజశేఖర్ కు ఫోన్ చేసి ‘రోజూ మమ్మల్ని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పెడుతున్నావని.. తిక్క రేగుతోందా? లం. కొడుకా అంటూ ’ దారుణమైన తిట్లతో విరుచుకుపడ్డాడని ఆ ఆడియోను బాధితుడు విడుదల చేశాడు.

    Also Read: 100 మంది పోలీసులు.. రాజాసింగ్ ఇంటి వద్ద టెన్షన్

    కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను బెజ్జంకి మండల సమస్యలపై ఓ యువకుడు ప్రశ్నించాడు. దీనికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దారుణమైన బూతులతో నిందించాడని బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఆడియోను మీడియాకు విడుదల చేశాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి అసభ్య పదజాలంతో తిడుతూ ‘నీ అంతు చూస్తా’ అని బెదిరించాడని బాధితుడు ఆరోపించాడు. నియోజకవర్గ సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అంతు చూస్తానని ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయాడని యువకుడు ఆరోపించాడు.

    Also Read: వైరల్: ఆరోజుల్లో.. కేటీఆర్ పాత జ్ఞాపకం..

    దీనికి బాధితుడు రాజశేఖర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఎమ్మెల్యే అయ్యిండి బూతులు తిడతావా? రెండు సార్లు ఎన్నుకున్నందుకు మేం సిగ్గుపడుతున్నాం.. మీకు తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదా అని గట్టిగానే ఎమ్మెల్యేను నిలదీశాడు. ఇప్పుడు ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో ఇదే..