దేశంలో మనకు చాలా రకాల పండ్లు అందుబాటులో ఉన్నా కొన్ని పండ్లు మాత్రమే ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలా మనకు ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పండ్లలో కివి ఒకటి. చల్లని దేశాల్లో మాత్రమే పండే ఈ పండ్లు ఖరీదు ఎక్కువైనా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. కోడిగుడ్డు ఆకారంలో కనిపించే ఈ పండ్లలో యాపిల్ పండుతో పోల్చి చూస్తే ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
Also Read: జొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో కివి పండ్లను తీసుకుంటే మరీ మంచిది. చలికాలంలో వచ్చే జబ్బుల నుంచి త్వరగా ఉపశమనం కలిగించడంలో కివి సహాయపడుతుంది. కివి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కాపాడటంలో కివి సహాయపడుతుంది. వైద్యులు మధుమేహంతో బాధ పడేవాళ్లు, హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడే వాళ్లు సైతం కివి పండ్లను తీసుకోవచ్చని చెబుతున్నారు.
Also Read: చలికాలంలో పెదవులు పగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
రోజూ కివి పండు తీసుకునే వారిలో కంటి సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు కంటిచూపు మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు డైట్ లో కివి పండును చేర్చుకుంటే మంచిది. రక్తం గడ్డ కట్టే సమస్యను కూడా కివి తగ్గిస్తుందని నార్వే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నోటికి ఎంతో రుచిగా ఉండే కివి పండ్లు బీపీ, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో సైతం సహాయపడతాయి.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
ఆస్తమా సమస్యతో బాధ పడేవాళ్లు ఆ సమస్య నుంచి రక్షించుకోవడానికి కివి పండును తినవచ్చు. అలర్జీలను తగ్గించి ఆరోగ్యకరమైన ప్రయోజనాలని కివి చేకూరుస్తుంది. హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షించడంలో కివి సహాయపడుతుంది.