నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైతం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 15 ఉద్యోగాల కోసం ఈసీఐఎల్ నుంచి నోటిఫికేషన్ వెలువడగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవాన్ని బట్టి రెండు లక్షల రూపాయలు వేతనంగా లభిస్తుంది. భారీ మొత్తంగా వేతనం పొందే ఛాన్స్ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. Also Read: నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. […]

Written By: Navya, Updated On : December 12, 2020 11:23 am
Follow us on


గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైతం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 15 ఉద్యోగాల కోసం ఈసీఐఎల్ నుంచి నోటిఫికేషన్ వెలువడగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవాన్ని బట్టి రెండు లక్షల రూపాయలు వేతనంగా లభిస్తుంది. భారీ మొత్తంగా వేతనం పొందే ఛాన్స్ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.

Also Read: నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. ఏకంగా 23,000 ఉద్యోగాలు..?

http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 31, 2020 దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈసీఐఎల్‌ ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ.42,500 వేతనంతో ఉద్యోగాలు..?

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా వెబ్ లైట్ లో ఉన్న కంపెనీ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగ అర్హత, అనుభవంలలో మార్పులు ఉంటాయి. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్‌, పీజీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. ఈసీఐఎల్‌ కేంద్ర ప్రభుత్వంలోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన కంపెనీ అనే సంగతి తెలిసిందే. అర్హత, అనుభవం ఆధారంగా లభించే వేతనంలో మార్పులు ఉంటాయి.