ప్రభుత్వం సంచలన నిర్ణయం.. జీన్స్, టీషర్ట్ వేసుకోవడంపై ఆంక్షలు..?

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగుల డ్రెస్ కోడ్ విషయంలో మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించింది. డ్రెస్ కోడ్ నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆఫీస్ లలో పని చేసే ఉద్యోగులు, సెక్రటేరియట్ ఉద్యోగులు టీషర్ట్, జీన్స్ కాకుండా ఇతర దుస్తుల్లో ఇకపై విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. Also Read: వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం వెతుకుతున్నారా.. తస్మాత్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 12, 2020 11:45 am
Follow us on


మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగుల డ్రెస్ కోడ్ విషయంలో మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించింది. డ్రెస్ కోడ్ నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆఫీస్ లలో పని చేసే ఉద్యోగులు, సెక్రటేరియట్ ఉద్యోగులు టీషర్ట్, జీన్స్ కాకుండా ఇతర దుస్తుల్లో ఇకపై విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

Also Read: వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం వెతుకుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?</a
>

వేలల్లో, లక్షల్లో వేతనాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టానుసారం ఇకపై డ్రెస్ వేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ఆంక్షలను అమలులోకి తెచ్చింది. కొత్త నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను సైతం ప్రభుత్వం పొందుపరిచింది. ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై చులకన భావం రాకుండా ఉండేందుకు ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగాలు..?

కొందరు ఉద్యోగులు చేసే పనికి తగిన దుస్తులు ధరించడం లేదని ఆ కారణం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. శుభ్రత లేని, అనువు కాని దుస్తులను ప్రభుత్వ ఉద్యోగులు ధరించడం సరికాదని మహారాష్ట్ర సర్కార్ పేర్కొంది. పురుష ఉద్యోగులు ఫార్మల్ దుస్తులు ధరించాల్సి ఉండగా మహిళా ఉద్యోగులు చుడీదార్, ప్యాంట్ షర్ట్ ధరించవచ్చు. అయితే ప్యాంట్ షర్ట్ ధరించే మహిళలు చున్నీని కచ్చితంగా వేసుకోవాలని మహారాష్ట్ర సర్కార్ కోరింది.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

మహిళా ఉద్యోగులు చీరలు, సల్వార్, కుర్తాస్, ట్రౌజర్స్ కూడా ధరించవచ్చని.. యోగ్యమైన, పరిశుభ్రమైన వేషధారణలో ఉద్యోగులు కనిపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. వారంలో ఒకరోజు ఖాదీ వస్త్రాలు ధరించాలని, చెప్పులు హుందాగా ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.