Kiwi Fruit: పోషకాల నిధి ఈ ఫ్రూట్.. దీన్ని తింటే ఎన్ని ప్రయోజనాలంటే?

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా తోడ్పడుతుంది కివీ. గుండె, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే, ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివీ పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.

Written By: Swathi Chilukuri, Updated On : May 24, 2024 6:23 pm

Kiwi Fruit

Follow us on

Kiwi Fruit: కొన్ని వ్యాధులను ఎలాంటి డాక్టర్ సలహా, చికిత్స లేకుండానే నయం చేసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు వంటివి వీటికి మంచి ఔషదాల మాదిరి పని చేస్తుంటాయి. అయితే అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాల నుంచి రక్షించడంలో కివీ పండు కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్‌లు, విటమిన్ సి ఉంటాయి. అంటే ఇది బరువు తగ్గడంలో చాలా సహాయం చేస్తోంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా తోడ్పడుతుంది కివీ. గుండె, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే, ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివీ పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కివీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ వంటి ఎన్నో పోషకాలు మలితమై ఉంటాయి.

శరీరం పనిచేయాలి అంటే ఈ పోషకాలు అన్నీ కూడా ఉండాల్సిందే.వివిధ రకాల పండ్లను, కూరగాయలను తినేకంటే ఒక కివీ తింటే చాలు అంటున్నారు నిపుణులు. కివిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కివీని తినడం వల్ల రోజువారీ విటమిన్ సిలో 80శాతం శరీరానికి అందుతుంది. విటమిన్ సి శరీరంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందనేది తెలిసిందే. ఆక్సీకరణ నష్టం నుంచి కూడా కణాలను రక్షిస్తుంది. ఎన్నో అంటూ వ్యాధులను పారద్రోలేలా చేస్తుంది.

గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అవసరం అనే విషయం తెలిసిందే. ఇక ఈ పోటాషియం ఒక కివీలో 215 mg ఉంటుంది. కాబట్టి ఒక కివీని తీసుకోవడం వల్ల మీ రక్తపోటు, నరాలకు ఉపయోగం అవుతుంది. కివీ పండు అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు కిడ్నీలో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుంచి కూడా రక్షిస్తుంది.