Ananya Nagalla: అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. కొన్ని సినిమాల్లో నటించినా సరే తన నటనకు మంచి మార్కులు పడుతుంటాయి. పాత్రను బట్టి తన నటనను నిరూపిస్తుంటుంది. కొన్ని సార్లు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు మంచి పాత్రలు వస్తే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తుంటుంది అనన్య నాగళ్ల. రీసెంట్ గా మరో హారర్ సినిమాతో వచ్చి అందరినీ భయపెట్టాలి అనుకుంది. మరి ఆ సినిమా ఏదో కాదు తంత్ర.
తంత్ర అనే హారర్ సినిమాతో ఆమె అనుకున్నట్టు నిజంగా భయపెట్టి విజయం అందుకుంది అనన్య. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా రెగ్యూలర్ గా తన వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా రీసెంట్ గా ఓ వీడియోను షేర్ చేసింది ఈ అమ్మడు.
ఈ చిన్నది కర్రసాము చేస్తున్న వీడియోను తన అభిమానులతో పంచుకుంది. మన ఊళ్ళల్లో కర్రసాము చేసే విధంగానే ఓ రేంజ్ లో కర్ర సాము చేస్తూ కనిపించడంతో అను అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఇది కర్రసాము పర్ఫెక్ట్ కాదంట.. కేవలం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అని తెలుస్తుంది. ఓ సినిమా కోసం అనన్య కర్రసాము నేర్చుకుంటుంది అంటూ టాక్. దీంతో మొత్తం మీద యాక్టింగ్ తో పాటు కర్రసాము కూడా బాగానే చేస్తుంది అంటూ కొనియాడుతున్నారు ఆమె అభిమానులు.