Pani Puri: పానీపూరితో క్యాన్సర్.. నిషేధం యోచనలో ఆ రాష్ట్రాలు!

పానీ పూరీల్లో బ్రిలియంట్‌ బ్లూ, టార్ట్రాజైన్‌ వంటి రసాయన మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో క్యాన్సర్‌ కలిగించే పదార్థాలను గుర్తించారు. పానీపూరీలో రంగుల వాడకమే ఇందుకు కారణమని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : July 3, 2024 3:37 pm

Pani Puri

Follow us on

Pani Puri: పానీ పూరీ ప్రియులకు ఇది బ్యాడ్‌ న్యూస్‌.. రోడ్డు పక్కన బండి కనిపించగానే భయా తోడా ప్యాస్‌.. అంటూ పానీ పూరీ లాగించే వారికి ఇకపై అది దొరకకపోవచ్చు ఎందుకంటే.. పానీ పూరీనిని బ్యాన్‌ చేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పానీ పూరీలో క్యాన్సర్‌ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తమ రాష్ట్రాల్లో పానీ పూరీని నిషేధించాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాలు పీచుమిఠాయిపై నిషేధం విధించాయి. అందులోనూ క్యాన్సర్‌ కారక ఫుడ్‌ కలర్స్‌ కలుపుతున్నారని గుర్తించి నిషేధం విధించాయి. తాజాగా పానీ పూరీ పరిస్థితి అలాగే ఉంది.

అనేక వ్యాధులకు కారణం..
పానీ పూరీ అనేక వ్యాధులకు కారణం అవుతుందని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగానే పానీ పూరీ తిన్నవారు డయేరియా, టైఫాయిడ్, జాండిస్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు తేల్చారు. తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించి దానిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమైనట్లు తేల్చారు.

రసాయన మూలాలు..
పానీ పూరీల్లో బ్రిలియంట్‌ బ్లూ, టార్ట్రాజైన్‌ వంటి రసాయన మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో క్యాన్సర్‌ కలిగించే పదార్థాలను గుర్తించారు. పానీపూరీలో రంగుల వాడకమే ఇందుకు కారణమని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంజూరియా, కబాబ్స్‌ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి ఏజెంట్ల వాడకాన్ని నిషేధించారు. వాటినే పానీపూరీలో వాడుతున్నట్లు గుర్తించారు.

తమిళనాడులో కూడా..
తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1,500 పానీ పూరి షాపుల్లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు తయారీ దారులు నాణ్యత, ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. చాట్‌ మసాలాల్లో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పానీపూరీని బ్యాన్‌ చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.