Children Food: ఇదొక్కటి పెడితే చాలు పిల్లలు బలంగా ఉంటారు..

ఉగ్గులో చాలా పోషకాలు, విటమిన్లు ఉంటాయి. దీన్ని ఆరు నెలల పిల్లలకు మాత్రమే తినిపించాలి. బయట నుంచి తీసుకొని వచ్చే సెర్లాక్ లకు బదులు పిల్లలకు ఉగ్గు అందివవ్వడే ఉత్తమం అంటారు పెద్దలు.

Written By: Raj Shekar, Updated On : July 3, 2024 3:42 pm

Children Food

Follow us on

Children Food: పిల్లలకు పౌష్టిక ఆహారం అదించడం అంటే పెద్ద టాస్కే కదా. వీరికి మంచి ఆహారం అందించాలి. బయట తయరు చేసిన వాటిని పిల్లలకు పెట్టడం మంచిది కాదు. ఎన్నో రకాల పదార్థాలు కల్తీ అవుతున్న ఈ కాలంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వీరికి పౌష్టికాహారం ఎలా అందించాలి అనుకుంటున్నారా? ఇప్పుడు మంచి పోషకాలు కలిగిన ఓ ఆహారం గురించి తెలుసుకుందాం. అదే ఉగ్గు.

ఉగ్గులో చాలా పోషకాలు, విటమిన్లు ఉంటాయి. దీన్ని ఆరు నెలల పిల్లలకు మాత్రమే తినిపించాలి. బయట నుంచి తీసుకొని వచ్చే సెర్లాక్ లకు బదులు పిల్లలకు ఉగ్గు అందివవ్వడే ఉత్తమం అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ ఉగ్గు ద్వారా పిల్లలకు అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అందించవచ్చు. దీన్ని బియ్యం, పప్పులతో తయారుచేస్తారు. మరి మీ పిల్లలకు దీన్ని పెట్టాలి అనుకుంటున్నారా?

ఉగ్గు తయారీకి కావలసిన పదార్థాలు:
బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బాదం, క్యాష్ నట్స్ . బియ్యం తీసుకున్న దానిలో పావు వంతు ఈ పప్పులు తీసుకోవాలి.

ఉగ్గు తయారీ విధానం :-
బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడికి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. అలాగే పప్పులను కూడా కడిగి ఎండలో ఎండబెట్టాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బియ్యని దొరగా వేయించాలి. వాటిని పక్కకి పెట్టి, పప్పులు కూడా కొంచెం నెయ్యి వేసి దొరగా వేయించుకోవాలి. వేడి చల్లారిన తరువాత వీటిని వేరువేరుగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ని జల్లడ పట్టాలి. అంతే ఉగ్గు పౌడర్ రెడీ అయినట్టే.

ఉగ్గు తయారు చేసే విధానం: ఒక గిన్నె లో టీ గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి నీటిని బాగా మరగించాలి. మరొక గ్లాస్ లో టేబుల్ స్పూన్ ఉగ్గు పౌడర్ను కొన్ని వాటర్ లో కలిపి ఆ మరిగే నీటిలో పోసి బాగా కలపాలి. లేకపోతే ఉండలు కడుతాయి. మెత్తగా జారుడుగా అవ్వాలి. అప్పుడు ఉగ్గు తయారు అయినట్టూ. చల్లారిన తర్వాత తినిపిస్తే సరిపోతుంది. ఈ ఉగ్గు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారుచేసి పిల్లలకు పెట్టాలి.