https://oktelugu.com/

Myanmar: ఉద్యోగుల జీతాలు పెంచారు.. యజమానులను జైల్లో పెట్టిన ప్రభుత్వం

మయన్మార్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఉద్యోగులను నియమంచుకుని పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే వారి జీతాలను పెంచారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 3, 2024 3:27 pm
    Myanmar

    Myanmar

    Follow us on

    Myanmar: సైన్యం పాలనలో ఉన్న దేశం మయన్మార్‌.. అక్కడి సైనిక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైన్యం కఠిన చట్టాలు సామాన్యులకు ఇబ్బందిగా మారాయి. తాజాగా ఉద్యోగుల జీతాలు పెంచారన్న కారణంగా కొంత మంంది దుకాణాల యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలు పెంచడం నేరంగా పరిగణించింది.

    పది మంది దుకాణాదారుల అరెస్ట్‌..
    మయన్మార్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఉద్యోగులను నియమంచుకుని పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే వారి జీతాలను పెంచారు. ఈ కారణంగా అక్కడి సైనిక ప్రభుత్వం పది మంది దుకాణాల యజమానులను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. వారి వ్యాపారాలను కూడా బలవంతంగా మూసివేయించింది.

    చట్టవిరుద్ధం కాకపోయినా..
    మయన్మార్‌లో వేతనాల పెంపు చట్ట విరుద్ధం కాదు. అయినా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సైనిక ప్రభుత్వం వేతనాల పెంపును నేరంగా పరిగణిస్తోంది. వేతనాలు పెంచడం వలన ఆర్థిక అసమానతలు పెరుగుతాయని, సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తోంది. ఇదే విషయాన్ని అరెస్టు చేసిన దుకాణాల యజమానుల ఎదుట అంటించిన నోటీసుల్లో పేర్కొంది.

    వేతనాల పెంపు శాంతిభద్రతల సమస్యగా…
    వేతనాలు పెంచడాన్ని మయన్మార్‌ సైనిక ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యగా భావిస్తోంది. అరెస్టు అయిన దుకాణాల యజమానులపై ఇదే అభియోగం మోపింది. ఈ కారణంగానే వారిని జైల్లో పెట్టింది.

    మూడేళ్లుగా సైనిక పాలన..
    ఇదిలా ఉంటే మయన్మార్‌లో మూడేళ్లుగా సైనిక పాలనే కొనసాగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్‌సాంగ్‌ సూకీ ప్రభుత్వాన్ని 2021లో సైన్యం కూలదోసింది. అప్పటి నుంచి మిటలరీ పాలన సాగుతోంది. సైనిక పాలనలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రజాస్వామ్యయ అనుకూలవాదులు కూటములుగా ఏర్పడి సాయుధ బృందాలపై తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో దేశంలో అస్థిరత నెలకొంది.