Beauty Tips: అందానికి జపనీస్ సీక్రెట్.. ఎన్నో సమస్యలకు చెక్..

ఫేషియల్ మసాజ్ వల్ల చాలా లాభాలున్నాయి. అందులో ముఖ్యంగా గువా షా మసాజ్‌తో కలిగే లాభాలు ఒకసారి తెలుసుకోని ఆచరించండి. ఈ స్టోన్‌తో మసాజ్ చేస్తే ముడతలు, మచ్చలు తగ్గి ముఖ కాంతి మెరుగు అవుతుంది. గువా షా.. ఇది జపనీస్‌ బ్యూటీ సీక్రెట్.

Written By: Swathi, Updated On : August 22, 2024 9:28 pm

Beauty Tips(1)

Follow us on

Beauty Tips: కొంతమంది కొన్ని బ్యూటీ టిప్స్ పాటిస్తూ వారి స్కిన్ మెరుపును పెంచుకుంటారు. కొందరు నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే మరికొందరు మాత్రం ఖరీదైన ప్రొడక్ట్స్ లను వాడుతుంటారు. కానీ అన్ని ప్రొడక్ట్స్ అందరికీ సూట్ అవవు. కొన్ని సార్లు వాటి వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎంత ఖరీదు చేసే ప్రొడక్ట్స్ లను వాడినా సరే ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. దీంతో ఆయుర్వేదానికి షిఫ్ట్ అవుతారు మరికొందరు. అక్కడ కొన్ని సార్లు ఫలితాలు ఉంటే కొన్ని సార్లు ఉండవు. ఇక మందారం, తేనె, పసుపు, అలోవెరా వంటివి ఇంట్లోనే వాడుతూ స్కిన్ మెరుపును, చర్మ సమస్యల నుంచి దూరం అవుతుంటారు. ఇక మన ఇండియన్ సీక్రెట్స్ మీలో చాలా మందికి తెలిసిందే. కానీ ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఫేషియల్ మసాజ్ గురించి తెలుసుకుందాం.

మీరు బ్యూటీ పార్లర్ లో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు కదా. మసాజ్ లు, మేకప్, ఫేషియల్స్ తో తమ స్కిన్ ను కాపాడుకుంటారు. అయితే మీరు ఇలాంటివి అన్నీ చేస్తుంటే జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పని చేసి చూడండి. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు నిపుణులు. గువాషా.. ఇదేంటి పేరు కొత్తగా వింతగా ఉంది అనుకుంటున్నారా? ఇది జపనీస్ బ్యూటీ సీక్రెట్. మన ఇంతకు ముందు అనుకున్నాం కదా మన దేశీయుల సీక్రెట్ కాకుండా ఇతర దేశస్థుల సీక్రెట్ గురించి తెలుసుకుందామని.. సో స్టోరీ చదివేసేయండి.

ఈ ఫేషియల్ మసాజ్ వల్ల చాలా లాభాలున్నాయి. అందులో ముఖ్యంగా గువా షా మసాజ్‌తో కలిగే లాభాలు ఒకసారి తెలుసుకోని ఆచరించండి. ఈ స్టోన్‌తో మసాజ్ చేస్తే ముడతలు, మచ్చలు తగ్గి ముఖ కాంతి మెరుగు అవుతుంది. గువా షా.. ఇది జపనీస్‌ బ్యూటీ సీక్రెట్. అక్కడ ఆడవారి స్కిన్‌కేర్‌లో కచ్చితంగా ఈ గువా షా స్టోన్ ను ఉపయోగిస్తారు. ఈ మసాజ్ చర్మంలో రక్తప్రసరణని పెంచి చర్మ కాంతిని పెంపొందిస్తుంది. చర్మాన్ని టైట్‌గా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది ఈ గువాషా స్టోన్. దీనితో రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే స్కిన్ యంగ్‌గా కనిపిస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే ముడతలు, ఫైన్‌లైన్స్ తగ్గుముఖం పడుతాయి అంటున్నారు నిపుణులు.

ఈ మసాజ్‌తో చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. దీంతో స్కిన్‌లో సాగే గుణం పెరిగి మరింత అందంగా కనిపిస్తారు. అంతేకాకుండా, దీంతో మసాజ్ చేస్తే ముఖంపై వాపులు ఉన్నా సరే అవి తొలిగిపోతాయి. ట్యాక్సిన్స్ కూడా నయం అవుతాయి. ఈ స్టోన్‌తో మసాజ్ చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గి గ్లో పెరిగి ముఖం షైనీగా అవుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గి ముఖం బ్రైట్‌గా కనిపిస్తుంది. గువా షా స్టోన్‌తో మసాజ్ చేయడం వల్ల కంటి కింద నల్లని వలయాలు, వాపులు ఉన్నా సరే తగ్గుముఖం పడతాయట..

రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే కళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా మారుతాయట. మసాజ్ చేసేటప్పుడు కళ్ళ కింద ఏరియా దగ్గర చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మీ స్కిన్‌కి సరిపోయే ఏదైనా సీరమ్ తీసుకుని ముఖానికి అప్లై చేసి ఆ తర్వాత ఈ రాయిని క్లీన్ చేసి అప్పుడు ముఖంపై మసాజ్ చేసుకోండి. కింద నుంచి పైకి స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. దీని వల్ల చర్మ సమస్యలన్నీ దూరం అవుతాయి.