Husband and wife Relationship : ఈమధ్య కాలంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వల్ల పెళ్లయి ఎన్నేళ్లు అయిన సంతోషంగా ఉంటారని అందరూ భావిస్తారు. అయితే ప్రేమ లేదా పెద్దల కుదిర్చిన వివాహం అయినా సరే బంధంలో కొన్ని చిట్కాలు పాటించాలి. పెళ్లయిన కొత్తలో ఎంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం, గౌరవం ఉంటాయో.. 60 ఏళ్ల తర్వాత కూడా అలానే ఉండాలి. అప్పుడే దాంపత్య బంధానికి విలువ ఉంటుంది. పెళ్లయిన కొత్తలో ఉన్నట్లు చాలా ఏళ్ల తర్వాత భార్యాభర్తలు అసలు ఎందుకు ఉండలేరు. వంద జంటల్లో రెండు లేదా మూడు జంటలు మాత్రమే ఇలా ఉంటారు. మిగతా జంటలు పెళ్లయిన కొత్తలోనే బాగా ఉంటారు. ఆ తర్వాత ఉండరు. పెళ్లయి ఎన్నేళ్లు అయిన భార్యభర్తలు కొత్తలో ఉన్న ప్రేమగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలేంటి ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.
భార్యాభర్తలు సంతోషంగా జీవితాంతం ఉండాలంటే 777 నియమం పాటించాలి. ఇదేంటి కొత్త నియమమా.. ఇది పాటిస్తే బంధం శాశ్వతంగా ఆనందంగా ఉంటుందా అనే సందేహం చాలామందికి వస్తుంది. అయితే ఈ నియమాన్ని ఒక్కసారి పాటించి చూడండి. మీ వివాహ బంధం ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. 777 నియమం అంటే వారానికొకసారి, ఏడు వారాలకు, ఏడు నెలలకు మీ పార్ట్‌నర్‌కి సమయం ఇవ్వాలి. ఇలా చేస్తే బంధం తప్పకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రోజంతా ఆఫీస్, పనులు అని బిజీగా ఉంటారు. కనీసం వారంలో ఒకరోజైన మీ పార్ట్‌నర్‌తో టైమ్ స్పెండ్ చేయండి. సమయం లేకపోయిన మీరే క్రియేట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. చాలామంది పనుల్లో బిజీ అయి భాగస్వామిని పట్టించుకోరు. కానీ వాళ్లకి కాస్త సమయం ఇస్తే మీ బాండ్ ఎప్పటికీ బాగానే ఉంటుంది.
ఏడు వారాలకు ఒకసారి బయటకు వెళ్తుండండి. ఎంత బిజీగా ఉన్నాసరే ఫ్రీ అయ్యి మీ భాగస్వామితో టైమ్ స్పెండ్ చేస్తే బాగుంటుంది. అప్పుడే కదా మీ భాగస్వామి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏవైనా సమస్యలతో బాధపడుతున్న మీకు తెలుస్తుంది. తన బాధలు, సంతోషాలు మీతో షేర్ చేసుకోవడానికి తనకి కాస్త సమయం ఇవ్వాలి కదా. ఇద్దరూ ఏకాంతంగా కనీసం ఒకరోజైన గడిపితే ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతుంది. అలాగే ఏడు నెలలకొకసారి దంపతులు ఏదైనా ట్రిప్‌కి వెళ్తుండాలి. కొత్త ప్రదేశం, ఆ ప్రకృతి, ఇద్దరు మాట్లాడుకోవడనికి కాస్త సమయం అన్ని దొరుకుతాయి. వీటివల్ల ఇద్దరూ ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మీ జీవితంలో ఉద్యోగం ఎంత ముఖ్యమో పార్ట్‌నర్ కూడా అంతే ముఖ్యం. తనకి ఇవ్వాలసిన టైమ్ ఇయ్యాలి. అప్పుడే మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొని అయిన జీవితాంతం సంతోషంగా ఉంటారు. ట్రిప్‌కి అంటే దేశాలు దాటి వెళ్లవసరం లేదు. కనీసం మీరు ఉండే విలేజ్ దాటి కొత్త ప్లేస్‌కి మీ పార్ట్‌నర్‌ను తీసుకెళ్తే చాలు.