https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు ఈ నాలుగు రాశుల ఉద్యోగులకు అన్నీ విజయాలే..

వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 23, 2024 / 07:54 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈ రోజు చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శూల యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు, ఉద్యోగులు అధిక ప్రయోజనాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారికి ప్రత్యర్థుల బెడద ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

    వృషభ రాశి:
    విహార యాత్రలకు వెళ్తారు. దీంతో ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు ఏ పని మొదలు పెట్టినా అది సక్సెస్ అవుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.

    మిథున రాశి:
    పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఎంతో కాలంగా ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడుతారు. కష్టపడినదానికి ఫలితం ఉంటుంది.

    కర్కాటక రాశి:
    ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వీరికి సీనియర్ల మద్దతు ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    సింహారాశి:
    ఉద్యోగులు సీనియర్ అధికారులు మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

    కన్య రాశి:
    స్నేహితులకు డబ్బు సాయం చేస్తారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తారు.

    తుల రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు నిరాశతో ఉంటారు. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    వృశ్చిక రాశి:
    మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారులు ప్రణాళిక ప్రకారంగా పెట్టుబడులు పెడుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు కొత్త అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితుల ద్వారా ఆర్థిక సాయం పొందుతారు. రోజువారీ పనుతో బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యలతో ఉల్లాసంగా ఉంటారు.

    మకర రాశి:
    విహార కార్యక్రమాలతో సందడిగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు ఊహించని అవకాశాన్ని పొందుతారు.

    కుంభరాశి:
    ఉద్యోగులు ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యర్థుల బెడద ఉండనుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పొందుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    మీనరాశి:
    కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్తితి మెరుగుపడుతుంది. అర్హులైన వారికి వివాహ అవకాశాలు వస్తాయి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.