Jamun Benefits: నేరేడు పండ్లు తింటున్నారా? అయితే తెలుసుకోండి

షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట నేరేడు పండ్లు దివ్వౌషధం అంటున్నారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 17, 2024 3:50 pm

Jamun Benefits

Follow us on

Jamun Benefits: తియ్యగా ఉండే నేరేడు పండ్లను ఇష్టపడనివారు ఉంటారా? ఇందులో కొన్ని పుల్లగా ఉంటాయి. ఈ పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, హృద్రోగులకు నేరేడు పండ్లు చాలా మంచివి. ప్రస్తుతం మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లుగా పైగా ఉందని చెబుతున్నాయి అధ్యయనాలు. మరి ఈ వ్యాధితో బాధ పడే వారు నేరేడు పండ్లు తినవచ్చా అంటే బ్రహ్మాండంగా తినవచ్చు అంటున్నారు నిపుణులు.

షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట నేరేడు పండ్లు దివ్వౌషధం అంటున్నారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి. నేరేడులో విటమిన్-సి అధికంగా ఉంటుంది. అందుకే నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తింటే రోగనిరోధక శక్తి మెరుగు పడుతుంది. అలాగే జలుబు, ఫ్లూ వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. ఇదే కాదు మరిన్ని చర్మ సమస్యలలో కూడా నేరేడు చాలా సహాయం చేస్తుందట.

దంతాలు, చిగుళ్ళ సమస్యలను కూడా నివారిస్తుంది నేరేడు. చిగుళ్ళను బలోపేతం చేసి.. నోటి దుర్వాసనను తొలగిస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ నేరేడు గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. శరీరంలో హానికరమైన కార్బన్-డయాక్సైడ్ స్థాయిని తగ్గిస్తాయి. ప్రతి భాగానికి ఆక్సిజన్ చేరుకోవడానికి నేరేడులోని పోషకాలు సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది కూడా. అందుకే సీజన్ లో దొరికే నేరేడును తినండి.