https://oktelugu.com/

RGV Heroine: భక్తి బాట పట్టిన ఆర్జీవీ హాట్ హీరోయిన్.. ఇది ఊహించని మార్పు!

RGV Heroine: కొంత కాలం వరకు తన సినిమాల్లో ఆ హీరోయిన్ కి వరుస ఆఫర్స్ ఇస్తాడు. ఊర్మిళ, జియా ఖాన్, అంతర మాలి, నైనా గంగూలీ, అప్సర రాణి ఈ కోవకు చెందినవారే.

Written By: , Updated On : June 17, 2024 / 03:48 PM IST
Ram Gopal Varma Heroine

Ram-Gopal-Varma-Heroine

Follow us on

RGV Heroine: రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు దేశం మెచ్చిన దర్శకుడు. తన చిత్రాలతో ట్రెండ్ సెట్ చేశాడు. ఆయన తెరకెక్కించిన శివ, రంగీలా, సత్య, సర్కార్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. కాగా దర్శకుడు వర్మ తన కాంపౌండ్ లో కొందరు హీరోయిన్స్ ని మైంటైన్ చేస్తాడు. కెరీర్ బిగినింగ్ నుండి ఆయనకు ఈ అలవాటు ఉంది. కొంత కాలం వరకు తన సినిమాల్లో ఆ హీరోయిన్ కి వరుస ఆఫర్స్ ఇస్తాడు. ఊర్మిళ, జియా ఖాన్, అంతర మాలి, నైనా గంగూలీ, అప్సర రాణి ఈ కోవకు చెందినవారే.

వర్మ హీరోయిన్స్ లో నిషా కొఠారి కూడా ఒకరు. నిషా కొఠారి 2003లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆమె మొదటి చిత్రం జే జే. ఈ తమిళ చిత్రంలో ఆర్ మాధవన్ హీరోగా నటించాడు. రెండో చిత్రమే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసింది. మధ్యాహ్నం హత్య పేరుతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం తెరకెక్కించాడు. జేడీ చక్రవర్తి, నిషా కొఠారి ప్రధాన పాత్రలు చేశారు. దర్శకుడు వర్మ నిర్మించిన జేమ్స్ మూవీలో నిషా కొఠారి గ్లామరస్ రోల్ లో అలరించింది.

Also Read: Star Director: ఆ బ్యానర్ ను నమ్ముకొని ఇబ్బందుల్లో పడ్డ స్టార్ డైరెక్టర్…

2005లో విడుదలైన సర్కార్ భారీ విజయం అందుకుంది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీలో నిషా కొఠారి సైతం నటించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ(2006), ఆగ్ చిత్రాల్లో కూడా నిషా కొఠారి హీరోయిన్. విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్ళ గుండెల్లో నిషా కొఠారి గుబులు రేపింది. దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఒక్క మగాడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నిషా కొఠారి నటించడం విశేషం.

Also Read: Sai Dharam Tej: మామయ్య పవన్ కి సాయి ధరమ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటీ? దాని విలువ ఎంతో తెలుసా?

2013కి వచ్చిన సైకో మూవీలో మరోసారి నిషా కొఠారికి ఛాన్స్ ఇచ్చాడు వర్మ. అయితే వర్మ డైరెక్షన్ లో ఆమె చేసిన చిత్రాలేవీ ఆడలేదు. ఒక సర్కార్ మాత్రమే ఆకట్టుకుంది. నిషా కొఠారి తన పేరును ప్రియాంక కొఠారిగా మార్చుకుంది. ఫలితం మాత్రం శూన్యం. కాగా ఆమె షాకింగ్ మేకోవర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పొట్టి బట్టల్లో విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసిన నిషా కొఠారి భక్తి బాట పట్టింది. కాషాయ బట్టల్లో ఆమె భక్తురాలిగా మారిపోయిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మార్పుకు కారణం ఏమిటని జనాలు అవాక్కు అవుతున్నారు…