Kamala Haasan And Rajinikanth: కమలహాసన్ రజినీకాంత్ ఇద్దరి గురువు ఒక్కరే అనే విషయం మీకు తెలుసా..?

1976వ సంవత్సరంలో 'అంతులేని కథ' సినిమాతో రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక వీళ్లిద్దరూ కూడా మొదటి సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు వైవిధ్యమైన కథంశాలను ఎంచుకొని సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలుగా ఎదిగారు. నిజానికి రజినీకాంత్ కంటే కమలహాసన్ మూడు సంవత్సరాల ముందు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

Written By: Gopi, Updated On : July 8, 2024 1:21 pm

Kamala Haasan And Rajinikanth

Follow us on

Kamala Haasan And Rajinikanth: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా తమిళ్ సినిమా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏలుతున్న నటుల్లో కమలహాసన్ రజినీకాంత్ ఇద్దరు ప్రముఖులనే చెప్పాలి. ఇక ఒకానొక సమయంలో లో వీళ్లిద్దరి లో నెంబర్ వన్ హీరో ఎవరు అనే దానిమీద చాలా రకాల చర్చలైతే జరిగాయి. మొత్తానికైతే రజనీకాంత్ మాస్ ఇమేజ్ ని సంపాదించుకుంటే, కమల్ హాసన్ క్లాస్ ఇమేజ్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా తన సినిమాలతో ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు.

ఇక వీళ్ళిద్దరూ వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలు చేసి వైవిద్యమైన పాత్రలను పోషించారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నటులను ఇండస్ట్రీకి తీసుకువచ్చిన దర్శకుడు ఒక్కరే అనే విషయం మనలో చాలామందికి తెలియదు. వీరిద్దరిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన ఆదర్శకుడు ఎవరు అంటే ‘కే బాలచందర్’.. లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆయన ఇద్దరు లెజెండరీ యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక 1973 వ సంవత్సరంలో బాలచందర్ తీసిన ‘అరంగేట్రం ‘ అనే సినిమా ద్వారా కమలహాసన్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ని పోషించాడు.

1976వ సంవత్సరంలో ‘అంతులేని కథ’ సినిమాతో రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక వీళ్లిద్దరూ కూడా మొదటి సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు వైవిధ్యమైన కథంశాలను ఎంచుకొని సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలుగా ఎదిగారు. నిజానికి రజినీకాంత్ కంటే కమలహాసన్ మూడు సంవత్సరాల ముందు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక రజనీకాంత్ కంటే కమలహాసన్ సీనియర్ అనే చెప్పాలి. రజినీకాంత్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కమల్ హాసన్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. అయినప్పటికీ రజినీకాంత్ మాత్రం కమలహాసన్ ను బీట్ చేసి మాస్ హీరోగా ఎదిగి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో గా మారిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికీ వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది…