IVF Childrens : ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు మిగతా పిల్లల కంటే తెలివిగా ఉంటారా? ఇందులో నిజమేంత?

చాలా మందికి పిల్లలు పుట్టకపోవడంతో ఐవీఎఫ్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలా పుట్టే పిల్లలు.. సహజంగా పుట్టిన పిల్లలతో పోలిస్తే కొంచెం వేరేగా ఉంటారని అందరు అంటుంటారు. అయితే డాక్టర్లు ఈ విషయంలో ఏం చెబుతున్నారంటే.. ఐవీఎఫ్ద్వారా పుట్టిన పిల్లలు, సాధారణ పిల్లల లక్షణాలు ఒకేలా ఉంటాయన్నారు.

Written By: Suresh, Updated On : September 8, 2024 9:56 pm

IVF Childrens

Follow us on

IVF Childrens  : ఈరోజుల్లో చాలా మంది సంతానం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత జీవన శైలి, ఆహారంలో మార్పులు ఉంటే కారణాల వల్ల చాలామంది సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్నారు. పెళ్లి అయ్యి ఏళ్లు అవుతున్న పిల్లలు కలగని వాళ్లు ఐవీఎఫ్ ను ఆశ్రయిస్తున్నారు. దీని వల్ల తప్పకుండా పిల్లలు కలుగుతారని అంటుంటారు. అయితే అందరికీ ఐవీఎఫ్ వల్ల పిల్లలు కలుగుతారని చెప్పలేం. కొందరి బాడీ బట్టి, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే ఐవీఎఫ్ సక్సెస్ అవుతుంది. అయితే మిగతా పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు చాలా తెలివిగా ఉంటారని అందరు అనుకుంటారు. అసలు ఇందులో నిజమేంత? సాధారణ పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ పిల్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటో మరి తెలుసుకుందాం.

చాలా మందికి పిల్లలు పుట్టకపోవడంతో ఐవీఎఫ్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలా పుట్టే పిల్లలు.. సహజంగా పుట్టిన పిల్లలతో పోలిస్తే కొంచెం వేరేగా ఉంటారని అందరు అంటుంటారు. అయితే డాక్టర్లు ఈ విషయంలో ఏం చెబుతున్నారంటే.. ఐవీఎఫ్ద్వారా పుట్టిన పిల్లలు, సాధారణ పిల్లల లక్షణాలు ఒకేలా ఉంటాయన్నారు. పుట్టిన తర్వాత పిల్లలు పెరిగే వాతావరణం, వాళ్ల ప్రవర్తన బట్టి ఉంటుంది. కానీ ఇలా ఐవీఎఫ్ ద్వారా వాళ్ల ఇంటెలిజెన్స్ ని చెప్పలేమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని అధ్యయనాలు సహజంగా పుట్టిన పిల్లల కంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు కొంచెం బెటర్ గా ఉంటారని చెబుతున్నాయి. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు యవ్వనంగా ఉండటంతో పాటు.. ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. సహజంగా పుట్టిన పిల్ల‌ల్లో సామాజిక, ప‌ర్యావ‌ర‌ణ అంశాల గురించి బాగా తెలిసి ఉంటుందని అంటున్నారు. అలాగే మాన‌సిక రుగ్మ‌త‌లు కూడా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు. అయితే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్ల‌లు తల్లిదండ్రులతో చాలా పాజిటివ్‌గా ఉంటున్నారని అధ్యయనంలో తేలింది.అలాగే పిల్ల‌ల ఆర్థిక ప‌రిస్థితి కూడా బాగానే ఉందని తెలిపాయి. అలాగే బరువు కూడా బానే ఉంటారని తేలింది. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్ల‌ల్లో ఉండే శారీర‌క‌, మానసికంపై అధ్యయనాలు చేశాయి. అయితే ఒక వయస్సు వ‌చ్చే స‌రికి పెద్ద‌గా తేడా లేద‌ని తెలుపుతున్నాయి. ఈ ఐవీఎఫ్ ను 1978లో మొదటిసారిగా అమ‌లు చేవారు. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 80 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు ఐవీఎఫ్ ద్వారా పుట్టారు.

పిల్లలు తెలివిగా పుట్టడం అనేది.. జన్యుపరానికి సంబంధించినది. తల్లి, తండ్రి జెనిటిక్ లక్షణాల బట్టి వాళ్ల మెదడు తెలివిగా ఉంటుందని అంటున్నారు. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తాగడం, ఎలాంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండాలి. అలాగే పాటలు వినడం, యోగా మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. ఇలా చేస్తే.. పుట్టే పిల్లలు తెలివిగా పుడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.