https://oktelugu.com/

Rajma : వారానికి ఒకసారి అయిన రాజ్మా తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు

రాజ్మా ను రోజు డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు రాజ్మా తో బిర్యానీ, పప్పు వంటివి కూడా చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిది అని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా మాత్రమే తీసుకోవాలి.

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2024 / 04:25 AM IST

    Eating Rajma can check these problems

    Follow us on

    Rajma  రాజ్మా గురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. వీటిని ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్లు వండుతారు. అయితే ఈ మధ్య కాలంలో రాజ్మా రైస్, కర్రీ అని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఏంటి అసలు ఈ రాజ్మా? దీనిని ఎలా తింటారని అనుకుంటున్నారు. అయితే రాజ్మా వాళ్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడప్పుడు అయిన రాజ్మా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ రాజ్మాను కూరలుగా వండుకోవచ్చు లేదా రాజ్మా రైస్ ఇలా రకరకాలుగా చేయవచ్చు. ఎవరికి ఎలా తినాలనిపిస్తే అలా వాళ్ల స్టైల్ లో చేసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యాకరమైన ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఏంతో రుచికరంగా ఉండే.. ఈ రాజ్మా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మరి తెలుసుకుందాం.

    రాజ్మా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేయడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు మధుమేహన్ని తగ్గించడంతో పాటు బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ ను నిరోధించడంలో రాజ్మా గింజలు బాగా సాయపడతాయి. వీటిని తినడం వల్ల ఎల్లప్పుడూ కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా తినలేరు. కాబట్టి తొందరగా బరువు తగ్గుతారు. రాజ్మాలో ఉండే ఫోలేట్ అనే పోషకం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు. అలాగే రక్తంలో చక్కర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా చేయడంలో సాయపడతాయి.

    ఎక్సర్‌సైజ్ చేసేవాళ్లు కండరాలను, బాడీని పెంచుకోవడానికి రాజ్మాను ఎక్కువగా తింటారు. కండరాలు బలంగా పెరగడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ఇది శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అయితే రాజ్మాని షుగర్ ఉన్నవాళ్లు కూడా తినవచ్చు. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇందులో ఎక్కువగా ఉండే ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియంలు రక్తంలో చక్కెర నియంత్రణకు సాయపడతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి సాయపడుతుంది. రాజ్మా ను రోజు డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు రాజ్మా తో బిర్యానీ, పప్పు వంటివి కూడా చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిది అని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా మాత్రమే తీసుకోవాలి.