Chamomile Flowers : చామంతి పూల సీజనల్ మొదలైపోయిందోచ్.. ఇక పూలే పూలు వస్తుంటాయి. ఈ పూల గురించి టాపిక్ వస్తే చాలు పూజలే గుర్తొస్తాయి కదా. ఈ పూలలో ఎన్నో రకాలు ఉంటాయి కదా. చామంతి పూల నుంచి మంచి సువాసన వస్తుంది. చాలా మంది ఈ మొక్కలను ఇంటి వద్దనే పెంచుకుంటారు. ఈ చామంతి పూలతో కేవలం పూజలే కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచవచ్చు అంటున్నారు నిపుణులు. చామంతి పూలను ఉపయోగించి ఎన్నో బ్యూటీ ప్రోడక్స్ కూడా తయారు చేయవచ్చట. ఇతర టీల లాగానే చామంతి పూలతో కూడా టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వారంలో ఒక్కసారి ఈ టీ తాగినా బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. మార్కెట్లో కూడా చామంతి పూల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. కానీ మనం ఇంట్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ చామంతి పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఫుల్ గా ఉంటాయి. చాలా సమస్యలను ఈ పూల టీతో తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే?
ఒత్తిడి మాయం:
చామంతి పూల టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన పరార్ అవుతాయి. ప్రస్తుత జీవిత కాలంలో ఒత్తిడి కామన్ గా మారింది. అంతే కాదు మానసిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. శరీరానికి రిలాక్స్ కూడా వస్తుంది.
నిద్ర సమస్యలు: నిద్ర లేమి సమస్యలతో బాధపడేవారు ఈ టీని తాగడం వల్ల మీ నిద్ర సమస్య మాయం అవుతుంది. మీ నిద్ర క్వాలిటీగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే గాఢమైన నిద్ర వస్తుందట. కళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి.
రోగ నిరోధక శక్తి: ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యంగా తయారు అయింది. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే త్వరగా జబ్బుల కూడా వస్తాయి. అందుకే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇమ్యూనిటీని పెంచే వాటిల్లో ఇది కూడా ఒకటి. తరచూ తాగుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర సమస్యలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు మాయం అవుతాయి.
చర్మ సమస్యలు: చామంతి పూలతో చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు. ఒక కప్పులో ఎండిన చామంతి పువ్వుల పొడి, ఎర్ర కంది పప్పు పొడి ఒక స్పూన్, రోజ్ వాటర్ కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా రుద్దాలి. ఇలా ఓ పది నిమిషాల చేసి ఆ తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల.. నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. అంతే కాదు ఫేస్ కూడా సాఫ్ట్ గా అవుతుంది.
దేవుడి పూజకు, అమ్మాయిల అందాన్ని పెంచే ఈ చామంతి పూలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పూలు కూడా చాలా తక్కువ ధరలోనే లభిస్తాయి. ఇంట్లో దీని సాగు కూడా చాలా సులభమే. కానీ ఒకసారి మీ వైద్యులను సంప్రదించిన తర్వాత ఉపయోగించడం మంచిది అని మర్చిపోకండి.