https://oktelugu.com/

Health Tips: అలసటగా ఉంటుందా? ఏ పని చేయలేకపోతున్నారా? జస్ట్ వీటిని తినండి చాలు..

విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత వస్తుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనంగా చేస్తుంటుంది. ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 3, 2024 / 02:53 AM IST

    Health Tips

    Follow us on

    Health Tips: ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ కారణంగా చాలా మంది సరైన ఆహారం తీసుకోవడం లేదు. దీంతో శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేక ఏకంగా ఏకాగ్రతను కూడా కోల్పోతున్నారు. ఏ పని చేయడం అయినా ఇబ్బందే. కొన్ని సార్లు కదలడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. అందుకే మంచి ఆహారం చాలా ముఖ్యం. ప్రోటీన్, విటమిన్ లు ఉన్న ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. బిజీ లైఫ్ లో ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీరు నీరసంగా ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా తేలికగా జీర్ణమయ్యేవి, శరీరానికి శక్తి లభించే వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు .

    శరీరంలో బలహీనతకు కారణం: విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత వస్తుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనంగా చేస్తుంటుంది. ఇది ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా జరుగుతుంది అంటున్నారు నిపుణులు. శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో కొన్ని ఆహారాలను యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచి పౌష్టికాహారంతో పాటు మీ ఆరోగ్యం కూడా బెటర్ గా ఉంటుంది. ఇంతకీ వేటిని తీసుకోవాలో కూడా చూసేయండి.

    సీజనల్ పండ్లు, కూరగాయలు: బలహీనంగా భావించే వ్యక్తులు వారి ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే శరీరానికి ఎంతో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్లలో మీకు పుష్కలంగా లభిస్తాయి. అదే సమయంలో పండ్లలో నీటి పరిమాణం కూడా ఎక్కువే లభిస్తుంది కాబట్టి డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరంలో నీటి కొరత కూడా బలహీనతకు కారణం అవుతుంది.

    లీన్ ప్రొటీన్ తీసుకోండి: శరీర బలహీనతను తొలగించడానికి లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ ఆహారం లభించాలంటే సముద్రపు చేపలు, మాంసం, గుడ్లు వంటి వాటిని మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇంకా ఆకుకూరలు, పెరుగు, కాయధన్యాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లీన్ ప్రోటీన్ గుండెకు మంచి చేస్తుంది. దీంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

    నట్స్, తృణ ధాన్యాలు: శరీరంలో బలహీనతగా ఉంటే నట్స్, తృణ ధాన్యాలు తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువ. దీని కారణంగా అవి సులభంగా జీర్ణం అవుతాయి. మరోవైపు ప్రతిరోజూ నట్స్, తృణ ధాన్యాలును తీసుకుంటే మీ బలహీనత, అలసట ఇట్టే మాయం అవుతుంది.

    పెరుగు: పెరుగు తినడం చాలా మందికి ఇష్టమే. కానీ కాస్త పెరుగు విషయం లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అలసట, నీరసాన్ని మటు మాయం చేస్తుంది పెరుగు.

    పాలకూర: పాలకూరలో ఐరన్ కావల్సినంత దొరుకుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. అలాగే కొవ్వును వేగంగా కరిగిస్తుంది.అంతేకాదు అలసట, బద్ధకం కూడా దూరం అవుతాయి.