https://oktelugu.com/

Cardamom Benefits: యాలకులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

యాలకుల్లో విటమిన్ సి ఫుల్ గా ఉంటుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి యాలకులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 3, 2024 / 03:04 AM IST

    Cardamom

    Follow us on

    Cardamom Benefits: యాలకులను చాలా మంది వంటల్లో ఉపయోగిస్తారు. ఇక మసాలా వంటలు చేస్తే కచ్చితంగా ఇవి ఉండాల్సిందే. మసాలా మాత్రమే కాదు స్వీట్లలో కూడా మంచి పాత్ర పోషిస్తాయి యాలకులు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఆకలిని పెంచి, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవే కాకుండా ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియ రేటును పెంచడంలో చాలా సహాయం చేస్తాయి. మరి ఈ యాలకుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా పాలల్లో యాలకులు వేస్తే వచ్చే ప్రయోజనాలు మరింత ఎక్కువ అంటున్నారు నిపుణులు. అదేంటో చూసేద్దామా?

    యాలకుల్లో విటమిన్ సి ఫుల్ గా ఉంటుంది. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి యాలకులు. దీంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. యాలకుల్లో రైబోఫ్లావిన్, నియాసిన్ అనే మూలకాలు ఉంటాయట. కాబట్టి ప్రతి రోజు యాలకుల తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

    యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మంచి పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తనాళాలను శుభ్రపరచి, రక్తపోటును నియంత్రిస్తుంది. ఇవే కాకుండా గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా దూరం చేస్తాయి అంటున్నారు నిపుణులు. యాలకులు శ్వాసకోశ వాపును తగ్గిస్తాయి. గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

    అలాగే పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా యాలకుల టీ సహాయం చేస్తుంది. అందుకే చాలా మంది యాలకుల టీని ఇష్టపడతారు. ఈ టీ టేస్ట్ ను కూడా అందిస్తుంది. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలను పెంచుతుంది. కాబట్టి, మీరు క్రమం తప్పకుండా ఏలకుల టీ తాగడం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా వదిలించుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు నిపుణులు. యాలకుల టీ ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం యాలకుల టీని ఓ స్విప్ కానిచ్చేయండి.

    వంటల రుచిని పెంచడంలో సహాయపడే యాలకులతో చాలా ఆరోగ్యమే ఉందన్నమాట. అయితే ఈ యాలకులను వివిధ రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాలకులను నమలడంతో నోటి దుర్వాసన సమస్య తగ్గిపోతుంది. యాలకులు నోటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు దరి చేరవు. యాలకుల్లో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను కంట్రోల్ చేస్తాయి.

    యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. ఇవి శరీరంలో వాపు, నొప్పిని కంట్రోల్ చేస్తాయి. యాలకులు తింటే శ్వాసకోస వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాదు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి. యాలకులను వివిధ రూపాల్లో తీసుకోవడంతో మానసిక ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగు అవుతుంది. యాలకుల్లో సినియోల్ అనే సమ్మేళనం ఉంటుంది కాబట్టి ఇది పురుషుల్లో నరాల పటిష్టతకు సహాయం చేస్తుంది. సంతానలేమి సమస్యలను దూరం చేస్తుంది.