Afternoon Sleep: పగటిపూట నిద్ర పనికి రాదంటారు. దీనికి సంబంధించి ఓ పాఠమే గతంలో ఉండేది. కుందేలు, తాబేలు రెండు పోటీ పెట్టుకుని ఎవరు ముందు గమ్యం చేరితే వారిదే గెలుపు అని నిర్ణయించుకుంటాయి. దీంతో రెండు పరుగు మొదలు పెడతాయి. కానీ కుందేలు మధ్యలోకి వెళ్లగానే తాబేలు నడిచేసరికి చాలా సేపయితదని అనుకుని ఓ కునుకు తీస్తుంది. దీంతో తాబేలు గమ్యం చేరుకుంటుంది. అందుకే పగటి నిద్ర మనకు చేటు అని చెప్పేందుకే ఈ పాఠాన్ని చేర్చారు. కానీ ప్రస్తుతం పగటినిద్ర మేలనే అంటున్నారు.
భోజనం చేశాక ఓ అరగంట పాటు కునికిపాట్లు తీస్తే ఎలాంటి రోగాలు దరిచేరవని చెబుతున్నారు. దీంతో పగటి నిద్ర ప్రాచుర్యాన్ని పొందుతోంది. అందరు కూడా మధ్యాహ్నం పూట నిద్ర పోవాలని భావిస్తున్నారు. దీంతో బద్దకం పెరిగిపోయే అవకాశాలున్నా ఆరోగ్యానికి మాత్రం మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే పగటి నిద్ర గురించి అందరు కలలు కంటున్నారు. తమకు నిద్ర పోతేనే బాగుంటుందని చెబుతున్నారు. పగటి నిద్రకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం నిద్రతో మధుమేహం, అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో పగటి పూట కాస్త నడుం వాల్చాల్సిందేననే ఉద్దేశానికి అందరు వస్తున్నారు. బద్దకం మాట ఎలా ఉన్నా రోగాలు నియంత్రణలో ఉంటాయనే లక్ష్యంతో అందరు నిద్ర పోయేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వైద్య రంగంలో వస్తున్న మార్పుల కారణంగా పగటి నిద్ర కాస్త ఒత్తిడిని జయిస్తుందని తెలుస్తోంది. అందుకే పగటి పూట ఒళ్లుకు విశ్రాంతి ఇచ్చే క్రమంలో నిద్ర పోవచ్చని సూచిస్తున్నారు.
మధ్యాహ్నం నిద్ర గుండె సంబంధిత రోగాలను సైతం తగ్గిస్తుందని తెలుస్తోంది. కొవ్వును కరిగించడానికి కూడా మేలు చేస్తుంది. ఇంకా కొన్ని ప్రయోజనాలు పొందాలంటే కొన్ని పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. భోజనం చేసిన తరువాత నిద్రపోవాలి. నిద్ర పోయేటప్పుడు ఎడమ చేయి తల కింద పెట్టుకుని పడుకోవాలి. ముప్పై నిమిషాలు మాత్రమే పడుకుంటే సరిపోతుంది. అంతే కానీ ఎలాగు మంచిదనే ఉద్దేశంతో పొద్దంతా పడుకుంటే బద్దకమే తప్ప లాభం ఉండదని తెలుసుకోవాలి. మన శాస్త్రవేత్తలు సూచిస్తున్న క్రమంలో మధ్యాహ్న నిద్ర మంచిదే అంటున్నా మన పూర్వీకులు మాత్రం పగటి నిద్ర పనికిరాదనే చెప్పారు.
Also Read: Divi Vadthya: షర్ట్ విప్పి సెగలు రేపిన తెలుగు హీరోయిన్.. అందాల విందు అదరహో