Sweat : చెమట పడితే మంచిదా? కాదా?

చెమట చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. చెమట వల్ల చర్మ ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.

Written By: Srinivas, Updated On : June 11, 2023 5:51 pm
Follow us on

Sweat : మనకు వేసవి కాలంలో చెమట బాగా పడుతుంది. ఇటు నీళ్లు తాగడంతోనే అటు చెమట రూపంలో పోతుంది. మన ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చెమట పట్టడం సహజమే. చెమట వల్ల మన శరీరం డీ హైడ్రేడ్ అవుతుందని అనుకుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదు. చెమట ఆరోగ్యానికి మంచిదే. చెమట చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. చెమట వల్ల చర్మ ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.

చెమటలకు కారణం

ఎండాకాలంలో చెమటలు విపరీతంగా పడతాయి. శరీర ఉష్ణోగ్రత 91 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఫారన్ హీట్ మధ్య ఉంటుంది. ఈ కాలంలో చెమట విపరీతంగా పడుతుంది. దీంతో మనం తొందరగా అలసిపోతాం. ఇలా వేసవి కాలంలో మన శరీరం వేడికి గురై చెమట బయటకు రావడం సహజమే. దీని వల్ల ఇబ్బందులు మాత్రం ఉండవు. కంగారు పడాల్సిన అవసరం లేదు.

చర్మానికి మేలు

చెమట పడితే చర్మానికి మేలు కలుగుతుంది. దీని వల్ల కాస్త దుర్వాసన వచ్చినా శరీరంలోని మలినాలు బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చెమట దోహదపడుతుంది. చర్మం తాజాగా ఉంచడానికి ఇది సహకరిస్తుంది. చెమట చర్మానికి మంచే చేస్తుంది. కానీ చెడు మాత్రం చేయదు. ఈ విషయం తెలుసుకోవాలి. చెమటను అసహ్యించుకోకూడదు.

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది

శరీరంలోని ఉప్పును తొలగిస్తుంది. మురికి, దుమ్ము, ధూళిలు పట్టకుండా చేస్తుంది. చెడు బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రాకుండా చేస్తుంది. సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. టాక్సిన్స్ ను దూరం చేస్తుంది. ఇలా చెమట వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు దక్కుతాయి.