Monsoon : నైరుతి రుతుపవనాలు విస్తరించినా వర్షాలు మాత్రం పడటం లేదు. దీంతో రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వానలు ఎప్పుడు పడతాయో పనులు ఎప్పుడు చేసుకుందామని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వర్షాలు పడాల్సి ఉండగా వాతావరణం అనుకూలంగా ఉండటం లేదు. మేఘాలు వస్తున్నా వర్షాలు మాత్రం రావడం లేదు. ఈ నెల 8నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కానీ వానలు మాత్రం జాడలేకుండా పోయాయి. దీంతో అన్నదాతలు అయోమయంలో పడుతున్నారు.
ప్రస్తుతం రుతుపవనాల్లో కదలికలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలే కొడుతున్నాయి. దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రుతుపవనాలు ఇలాగే ఉంటే పంటలు వేసుకోవడానికి ఇబ్బందే. రుతుపవనాల ద్వారా భారీ వర్షాలు పడితేనే మనకు అన్ని విధాలా మేలు కలుగుతుంది.
రుతుపవనాలు బాగుంటేనే వర్షాలు పడతాయి. వానలు పడితేనే మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఎల్ నినో అంటే వర్షాలు పడవు. దీంతో మన వ్యవసాయ రంగం కుదేలవుతుంది. రుతుపవనాలు బలహీన పడతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడవు.
ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. భూతాపం పెరుగుతోంది. మనదేశంలో పడే వర్షంలో 75 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే పడతాయి. దీంతోనే నదులు, రిజర్వాయర్లు నిండుతాయి. విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు సరిగా లేకపోతే నిరుద్యోగం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది.