ఏపీలో డ్రై రన్  విజయవంతం

కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని క్రుష్ణా జిల్లాలో ఐదుచోట్ల వ్యాక్సినేషన్ విజయవంతమైంది. వ్యాక్సిన్ ఇచ్చిన వారికి ఎలాంటి సమస్యలు రాలేదని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. పోలింగ్ తరహాలో డ్రైరన్ చేపట్టామన్నారు. డ్రై రన్ కు ఐదుచోట్ల ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్డ్ ఇనిస్టిట్యూట్, క్రుష్ణవేణి డిగ్రీ కళాశాల, […]

Written By: Suresh, Updated On : December 28, 2020 2:32 pm
Follow us on

కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని క్రుష్ణా జిల్లాలో ఐదుచోట్ల వ్యాక్సినేషన్ విజయవంతమైంది. వ్యాక్సిన్ ఇచ్చిన వారికి ఎలాంటి సమస్యలు రాలేదని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. పోలింగ్ తరహాలో డ్రైరన్ చేపట్టామన్నారు. డ్రై రన్ కు ఐదుచోట్ల ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్డ్ ఇనిస్టిట్యూట్, క్రుష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం, ప్రకాశ్ నగర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ప్రతి కేంద్రంలో ఐదుగురు వైద్య సిబ్బంది, 3 గదులను ఏర్పాటు చేశారు.