Potato Effects: చిప్స్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలాంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయట!

Potato Effects: పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చిప్స్ ను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. చిప్స్ రుచిగా ఉండటం వల్ల ఎక్కువమంది వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే చిప్స్ తినడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయనే విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. చిప్స్ తినడం వల్ల మానవులకు శారీరకంగా, మానసికంగా నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చెప్పవచ్చు. చిప్స్ మానసిక సమస్యలకు కారణమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. చిప్స్ ఎక్కువగా తినేవాళ్లను ఒత్తిడి, […]

Written By: Kusuma Aggunna, Updated On : April 20, 2022 10:42 am
Follow us on

Potato Effects: పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చిప్స్ ను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. చిప్స్ రుచిగా ఉండటం వల్ల ఎక్కువమంది వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే చిప్స్ తినడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయనే విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు. చిప్స్ తినడం వల్ల మానవులకు శారీరకంగా, మానసికంగా నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చెప్పవచ్చు. చిప్స్ మానసిక సమస్యలకు కారణమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది.

Potato Chips

చిప్స్ ఎక్కువగా తినేవాళ్లను ఒత్తిడి, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిప్స్ తినడం వల్ల బరువు పెరగడంతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మహిళల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు చిప్స్ కారణమవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. మన శరీరంలోని ప్రధానమైన అవయవాలలో గుండె ఒకటనే సంగతి తెలిసిందే.

Also Read: Dil Raju: ట్రెండింగ్ లోకి ‘దిల్ రాజు’ భార్య.. ఆ పిక్ వల్లే !

చిప్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిప్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చిప్స్ తయారీ కోసం వినియోగించే కెమికల్స్ వల్ల శరీరానికికి హాని కలుగుతుంది. చిప్స్ ఎక్కువగా తినడం వల్ల బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. చిప్స్ తినడం వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు పడక తప్పదు.

చిప్స్ శరీరంలోని ప్రధాన అవయవాలపై కూడా ప్రభావం చూపుతాయి. వైద్య నిపుణులు సైతం చిప్స్ కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. చిప్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంటే నెమ్మదిగా ఆ అలవాటును మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. చిప్స్ లో ఉండే ఎక్కువ శాతం ఉప్పు మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Also Read: Acharya : ‘ఆచార్య’ ఫస్ట్ షో అక్కడే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా షాకింగ్ కలెక్షన్స్ !