రెబ్బా పెద్ద దెబ్బ.. ఇది ఎవరో చెప్పుకోండి చూద్దాం.. అవకాశాల కోసమే నభా ఆరాటం
Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. యంగ్ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ ఇన్ స్టాగ్రామ్ ‘ట్రెండింగ్ రీల్స్’ ట్రై చేసింది. ఇందులో.. ఓ కుర్చీని పట్టుకుని జంప్ చేస్తూ ఫొటోలకు పోజిస్తూ సరదాగా కనిపించింది. పైగా ఇలా చేయడం అంత తేలిక కాదు అంటూ తన అనుభవాన్ని ఒక్క మాటలో వ్యక్తపరిచింది.
హాట్ బ్యూటీ అదాశర్మ చున్నీతో తన ముఖాన్ని కప్పేసి “ఇది ఎవరో చెప్పుకోండి చూద్దాం” అంటూ చిలిపిగా నెటిజన్లను అడిగింది. నీ గురించి మాకు తెలియనిది ఏముంది మేడమ్ అంటూ నెటిజన్లు అదాశర్మకి చిన్నపాటి షాక్ ఇచ్చారు.
తన ఫొటోను షేర్ చేస్తూ కిక్ ఇచ్చింది రిచా పనాయ్. మొత్తానికి రిచా పనాయ్ కి సినిమా అవకాశాలు రాకపోయినా .. సోషల్ మీడియాలో అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి.
యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ ఈషా రెబ్బాకు పుట్టినరోజు శుభాకాంక్షలు డిఫరెంట్ గా తెలిపింది. ఇంతకీ శివాత్మిక ఏమి మెసేజ్ చేసింది అంటే.. “రెబ్బా.. నువ్వు లేకపోతే లైఫే పెద్ద దెబ్బ” అంటూ కవిత లాంటి మెసేజ్ పోస్ట్ చేసింది శివాత్మిక.
అవకాశాలు తగ్గడంతో మళ్లీ ఫామ్ లోకి రావడానికి నభా నటేష్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె కొత్త ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం
Recommended Videos:


