ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సర్వరోగ నివారిణి అయిన ఉసిరి వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఉసిరి సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను సులభంగా కరిగిస్తుంది. ఉసిరి తీసుకోవడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి.
Also Read: పరగడుపున వెల్లుల్లి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
అయితే ఇతర కాలాలతో పోల్చి చూస్తే చలికాలం ఉసిరిని తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చలికాలంలో ఉసిరిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటంతో పాటు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నవాళ్లు ఉసిరిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
Also Read: ల్యాప్ టాప్ వేడెక్కుతోందా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
చలికాలంలో చాలామందిని చర్మ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. ఉసిరి తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. చలికాలంలో ఎక్కువగా వేధించే జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం లాంటి సమస్యలకు కూడా ఉసిరితో సులభంగా చెక్ పెట్టవచ్చు. ఉసిరి ఎక్కువగా తీసుకుంటే విటమిన్ సి లోపాన్ని సులభంగా అధిగమించవచ్చు. నిమ్మ, దానిమ్మ, నారింజలతో పోలిస్తే ఉసిరి ద్వారా సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
ఉసిరి వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఉసిరి గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.