కరోనా మహమ్మారి విజృంభణ తరువాత మనలో చాలామంది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం కోసం కొంతమంది ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటుంటే మరి కొందరు వైద్యుల సలహాలు, సూచనలను పాటించి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకుంటున్నారు. మరి మందులతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం సాధ్యమేనా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
Also Read: పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే వారికి ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గానే ఉంటుందని.. వ్యాయామం చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ, రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోయే వాళ్లకు ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం కొరకు ఎటువంటి మందులను వాడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే పిల్లలు, వృద్ధుల్లో మాత్రం ఇమ్యూనిటీ పవర్ ఉండదని వీళ్లు మాత్రం ఇమ్యూనిటీ బూస్టర్స్ ను వాడి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకునే వాళ్లు,స్టెరాయిడ్లను ఎక్కువగా వినియోగిస్తున్న వాళ్లు బీపీ, కిడ్నీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందని.. ఇలాంటి వాళ్లు ఇమ్యూనిటీ బూస్టర్స్ ను వాడాలని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్ల నుంచి ప్రబలే వ్యాధుల నుంచి ఇమ్యూనిటీ బూస్టర్ల సహాయంతో రక్షణ పొందవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
అయితే ఇష్టానుసారం ఇమ్యూనిటీ బూస్టర్లను వాడకూడదని.. వైద్యుల సలహాలు, సూచనలు పాటించి ఇమ్యూనిటీ బూస్టర్లను వాడితే మాత్రమే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.