సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చిన్న వారు వయసులో పెద్దవారి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆచారంగా వస్తోంది. ఈ విధంగా పెద్ద వారి పాదాలకు నమస్కరించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా పిల్లలు దీర్ఘాయుష్షుతో ఉంటారని భావిస్తారు.ఈ విధంగా పెద్దవారి కాళ్లకు నమస్కరించటం వెనుక శాస్త్రీయ కారణాలు మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్య పరమైన కారణాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఆ కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: 100 మంది పిల్లల్ని కనాలనుకుంటున్న మహిళ.. ఎందుకంటే..?
మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలతో పాటు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి. మన శరీర బరువును అంతటిని మన కాళ్లు మోస్తూ భూమిపై నిలబడతాయి. ఇలాంటి పాదాలకు నమస్కరించాలని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వయసులో చిన్నవారు పెద్దవారి పాదాలకు నమస్కరించడం వెనుక గల కారణం ఏమిటంటే… వయసులో పెద్దవారు జీవితంలోని అనుభవాల గురించి అన్నీ తెలుసుకుని ఉంటారు. అదేవిధంగా బుద్ధి, జ్ఞానం, తెలివి పెద్దవారి నుంచి పిల్లలకు సంక్రమించి జీవితంలో మంచి విషయాలను అందుకుంటారని వయసులో మన కన్నా పెద్ద వారి పాదాలకు నమస్కారం చేయాలి.
Also Read: మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాక్.. భారీగా పెరగనున్న టారిఫ్ ధరలు..?
పెద్దవారి పాదాలకు నమస్కారం చేసేటప్పుడు వంగి కుడి చేతితో కుడి పాదాన్ని ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకి నమస్కరించడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడటంతో అనేక గుండె జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం